క్రైమ్/లీగల్

నామినేటెడ్ పోస్టు పేరిట రూ.రెండు కోట్లు వసూలు: ఇద్దరి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్‌సుఖ్‌నగర్, అక్టోబర్ 29: కేంద్ర ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్టు ఇప్పిస్తామని ఓ మహిళ వద్ద రెండు కోట్ల పదిహేడు లక్షల రూపాయాలను వసూలు చేసిన నిందితులను మంగళవారం సరూర్‌నగర్ పోలీసులు అరెస్టు చేశారు. పోలిసులు తెలిపిన వివరాల ప్రకారం.. చంపాపేట్ ప్రాంతానికి చెందిన ప్రవర్ణ రెడ్డికి కేంద్ర ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్టు ఇప్పిస్తామని కారా సభ్యుడు రామచంద్రా రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి నమ్మబలికారు. దిల్లీకి తీసుకెళ్లి కృష్ణకిషోర్ అనే చిత్తురుకు చెందిన బీజేపీ నేతను పరిచయం చేశారు. ప్రవర్ణ రెడ్డి నుంచి 2016లో దశలవారీగా రెండు కోట్ల పదిహేడు లక్షల రూపాయలు వసూలు చేశారు. నెలలు గడుస్తున్న పోస్టు మాత్రం రావడం లేదు. ముగ్గురూ తప్పించుకు తిరుగుతున్నారు. దీంతో సరూర్‌నగర్ పోలీసులను ప్రవర్ణ రెడ్డి ఆశ్రయించింది. అనంతరం కోర్టును కూడా ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయాలని సరూర్‌నగర్ పోలిసులను కోర్టు ఆదేశించింది. బీజేపీ నేతలు కృష్ణకిశోర్, రామచంద్రారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డిపై చీటింగ్ కేసు నమోదు చేశారు. మంగళవారం రామచంద్రారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డిను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రధాన నిందితుడు కృష్ణకిశోర్ పరారీలో ఉన్నాడు.