క్రైమ్/లీగల్

జాతీయ రహదారిపై కారు దగ్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూసాపేట, ఆక్టోబర్ 30: మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట మండల పరిధిలోని సంకల్‌మద్ది గ్రామసమీపంలో 44వ జాతీయ రహదారి దగ్గర కారు మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయ. బుధవారం పెబ్బేరు మండలానికి చెందిన రంగాస్వామి, వీరయ్య, కృష్ణ, పుల్లయ్య, రామకృష్ణ, అనే ఐదుగురు వ్యక్తులు పెబ్బేరు నుండి ఏపీ21బీఎప్ 4024 నంబర్ గల మహేంద్ర వెరిటో కారులో మహబూబ్‌నగర్‌కు వెళ్తుండగా సంకల్‌మద్ది గ్రామ సమీపంలోని 44వ జాతీయ రహదారిపై కారు ఇంజన్ నుండి ఒక్కసారిగా మంటలు రావడాన్ని గుర్తించి కారును రోడ్డు పక్కకు అపి వెంటనే కారులో నుండి బయటకు దిగారు. మంటలు కారును చుట్టుముట్టి నిమిషాల వ్యవధిలోనే పూర్తిగా కాలిపోయింది. అయితే కారులో ఉన్న వారు అప్రమత్తంగా ఉండడంతో ప్రమాదం తృటిలో తప్పిపోయింది. కళ్లముందే కారు మొత్తం దగ్ధం అవుతుంటే తాము అదృష్టవశాత్తు బయటపడ్డామని బాధితులు తెలిపారు. మూసాపేట పోలీసులు ఘటనా స్థలానికి వెంటనే చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఫైర్ సిబ్బంద్దికి సమాచారం ఇవ్వడంతో కొత్తకోట నుండి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అర్పారు. అప్పటికే కారు మొత్తం కాలిపోయింది. ఈ మేరకు బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
*చిత్రం... కారులో నుంచి ఎగసిపడుతున్న మంటలు