క్రైమ్/లీగల్

కోర్టుకే బురిడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 30: న్యాయస్థానానే్న తప్పుడు పత్రాలతో మోసం చేశారు. నిందితులకు బెయిల్ ఇప్పించే క్రమంలో ఫోర్జరీ పత్రాలను న్యాయస్థానానికి ఇచ్చి నిందితులను విడిపించుకు పోతున్నారు. ఒక కేసులో లభించిన ఆచూకీతో పోలీసులు తీగలాగితే డొంకంతా కదిలింది. ఈ నేపథ్యంలో పోలీసులు 13 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. జిల్లాలోని వివిధ కోర్టులకు వచ్చే పలు సాధారణ కేసులతో పాటు గంజాయి, మాదకద్రవ్యాల అక్రమ రవాణా తదితర నేరాల్లో నిందితులకు బెయిల్ ఇప్పించేందుకు ఒక ముఠా పనిచేస్తున్నట్టు పోలీసులు అనుమానించారు. దీనిపై నిఘా ఉంచగా నకిలీ ధ్రువీకరణ పత్రాలు, గుర్తింపు కార్డులు, డాక్యుమెంట్లతో వివిధ కేసుల్లో నిందితులకు బెయిల్ ఇప్పిస్తున్న ముఠా గుట్టు రట్టయింది. దీనికి సంబంధించిన వివరాలను నగర పోలీసు కమిషనర్ ఆర్కే మీనా బుధవారం విలేఖరులకు వెల్లడించారు.
విశాఖలో స్థిరపడిన గుంటూరుకు చెందిన జీ కోటేశ్వర రావు నేతృత్వంలో అంగటి సూర్యనారాయణ, మారోజు జగదీశ్వర రావు, అలపాటి వెంకటేశ్వర రావు తదితరులు ఫోర్జరీ పత్రాలు సృష్టించడంలో దిట్టగా పేర్కొన్నారు. వీరితో పాటు మరికొంతమంది దొంగ సాక్ష్యాలు చెప్పే ముఠాను కూడా వీరు నడుపుతున్నారన్నారు. విశాఖ కేంద్రంగా వివిధ కేసుల్లో నిందితులకు బెయిల్ ఇప్పించే ముఠా పలు అక్రమాలకు పాల్పడిందన్నారు. నకిలీ ధ్రువపత్రాలతో పాటు ఆధార్ కార్డులు, సాల్వెన్సీలు, భూములకు సంబంధించిన పత్రాలు, వీఆర్‌వో ధ్రువీకరణ పత్రాలు సొంతంగా తయారు చేస్తూ కోర్టులను మోసగిస్తున్నారని తెలిపారు. ఆధార్ కార్డులో పేరు, చిరునామా అలాగే ఉంచి, ఫొటోను మార్చి తప్పుడు సాల్వెన్సీ, డాక్యుమెంట్లను కోర్టుకు సమర్పిస్తూ బెయిల్ పొందేందుకు సహకరిస్తున్నారన్నారు. గంజాయి రవాణ వంటి కేసుల్లో అత్యధికులు ఒడిశా, ఇతర రాష్ట్రాలకు చెందిన వారే నిందితులుగా పట్టుబడుతుంటారు. వీరికి బెయిల్ ఇప్పించేందుకు ముఠా పెద్ద మొత్తంలో నగదు గుంజుతుంటారన్నారు. అలాగే వివిధ కేసుల్లో తప్పుడు సాక్ష్యాలు ఇచ్చేందుకు మరి కొంతమంది సభ్యులను కూడా ఈ ముఠా చేరదీసిందని తెలిపారు. జీ మునిబాబులు, గుర్రాల శ్రీను, దుప్పర్తి ఈశ్వరరావు, పాలవలస కృష్ణ, తుపాకుల రాంబాబు, పల్ల వినోద్ కుమార్, సీహెచ్ బాల వెంకట గోపాలరావు, చామంతి జయకుమార్, కే ప్రవీణ్ దొంగ సాక్షులుగా చెలామణి అవుతున్నారని తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి నకిలీ పత్రాలతో పాటు ఆధార్ కార్డులు, 120కి పైగా రబ్బర్ స్టాంపులు, కొంత మొత్తంలో నగదు స్వాదీనం చేసుకున్నారు. సమావేశంలో డీసీపీ 1 రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
*చిత్రం... మీడియాకు వివరాలు వెల్లడిస్తున్న సీపీ ఆర్కే మీనా