క్రైమ్/లీగల్

ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్ట్రార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డోన్, అక్టోబర్ 31: ప్లాట్ల రిజిస్ట్రేషన్ కోసం ఓ వ్యక్తి నుం చి రూ. 10 వేలు లంచం తీసుకున్న కర్నూలు జిల్లా డోన్ సబ్ రిజిస్ట్రార్ నాగన్నను ఏసీబీ అధికారులు గురువారం అరెస్టు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. కర్నూలు నగరానికి చెందిన ఎం.రామతిమ్మారెడ్డి వెల్దుర్తిలో కొనుగోలుచేసిన ప్లాట్ల రిజిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లగా నాగన్న రూ. 17 వేలు లంచం డిమాండ్ చేశాడు. లంచం ఇవ్వకపోవడంతో డాక్యుమెంట్లు పక్కన పెట్టాడు. దీంతో చేసేదిలేక రామతిమ్మారెడ్డి రూ. 10 వేలకు ఒప్పందం కుదుర్చుకుని ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు గురువారం డాక్యుమెంట్ రైటర్ అబ్దుల్ రహీమ్ ద్వారా రూ. 10 వేలు సబ్ రిజిస్ట్రార్ నాగన్నకు అందజేస్తుండగా ఏసీబీ డీఎస్పీ నాగభూషణం సిబ్బందితో కలిసి అదుపులోకి తీసుకున్నారు. డాక్యుమెంట్‌రైటర్ అబ్దుల్లా రహీమ్‌ను సైతం అదుపులోకి తీసుకున్నారు. వీరిని శుక్రవారం ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ డీఎస్పీ నాగభూషణం తెలిపారు. కాగా కర్నూలు నగరంలోని గణేష్‌నగర్‌లో ఉన్న నాగన్న ఇంటిలో సైతం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి విలువైన డాక్యుమెంట్లు, భారీగా నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.