క్రైమ్/లీగల్

దుర్గగుడి ఈఓ నియామకం చెల్లదంటూ హైకోర్టులో పిటిషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), అక్టోబర్ 31: దుర్గగుడి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఈఓ)గా నియామకానికి సురేష్‌బాబు అర్హత చెల్లదంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పిటిషన్‌ను స్వీకరించిన రాష్ట్ర అత్యున్నత న్యాయస్ధానం దీనిపై నవంబర్ 6వ తేదీలోగా వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఆర్‌జేసి క్యాడర్ ఉన్న దుర్గగుడి ఈఓ పోస్టుకు డిప్యూటీ కమిషనర్ స్థాయి ఉన్న వ్యక్తిని ఎలా నియమిస్తారంటూ రిట్ పిటిషన్‌లో మహేష్ పేర్కొన్నారు. ఇక్కడ ఈఓగా విధులు నిర్వహించాలంటే స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ లేక ఐఏఎస్ అధికారులు అయి ఉండాలని దేవాదాయ ధర్మాదాయ శాఖలో స్పష్టంగా నిబంధనలు ఉన్నప్పటికీ నియమ నిబంధనలు ఉల్లంఘించి డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారికి ఈఓ పోస్టింగ్ ఇవ్వడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీంతో న్యాయస్ధానం ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ నవంబర్ 6లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.