క్రైమ్/లీగల్

డెంగ్యూతో ఇద్దరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్, నవంబర్ 1: డెంగ్యూ వ్యాధి మహబూబాబాద్ జిల్లాలో ప్రబలుతున్నది. ఈ వ్యాధి ఇద్దరిని కబళించింది. గార్ల మండల పరిధిలోని కొత్తతండాలో 14 సంవత్సరాల బాలిక, మూడుతండాలో ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటనలు శుక్రవారం చోటు చేసుకున్నాయి. మృతుల కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని మద్దివంచ గ్రామపంచాయతీ పరిధిలోని కొత్తతండాకు చెందిన ధారావత్ రవి కుమార్తె ధారావత్ నందిని (14) గార్ల కస్తూరిబా గాంధీ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. వారం రోజుల క్రితం జ్వరం రావడంతో స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించినా అదుపు కాకపోవడంతో పాఠశాల నిర్వాహకులు రవికి సమాచారం అందించారు. దీంతో ఖమ్మంలోని మరో ప్రైవేటు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించగా బాలిక పరిస్థితి విషమంగా మారిందని, హైదారాబాద్ యశోద ఆసుపత్రికి తీసుకెళ్ళాల్సిందిగా సూచించటంతో అక్కడికి తరలించారు. రెండు రోజుల పాటు చికిత్స పొందుతూ నందిని మృతి చెందిందని వారు తెలిపారు. కాగా మూడుతండాకు చెందిన ఇస్లావత్ రాందాస్ (46) గత ఎనిమిది రోజులుగా జ్వరంతో అస్వస్థతకు లోను కాగా చికిత్స కోసం ఖమ్మంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్టు రాందాస్ కుటుంబీకులు తెలిపారు.