క్రైమ్/లీగల్

జగన్ పిటిషన్ కొట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 1: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సీబీఐ కోర్టులో వ్యక్తిగత హాజరు నుండి మినహాయించాలని దాఖలు చేసిన పిటిషన్‌ను నాంపల్లి సీబీఐ కోర్టు తోసిపుచ్చింది. వైఎస్ జగన్మోహన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై అక్టోబర్ 18నే వాదనలు ముగించిన సీబీఐ కోర్టు శుక్రవారం నాడు ఆదేశాలు జారీ చేసింది. దాంతో సీబీఐ కోర్టు ఆదేశాలపై జగన్ వర్గం తదుపరి కార్యాచరణపై నిమగ్నమైంది. ఏపీ హైకోర్టులో ఈ ఆదేశాలపై అప్పీలు చేయాలనే యోచనలో ఉన్నట్టు తెలిసింది. ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ పరిపాలనపై దృష్టి పెట్టాల్సి ఉందని, హాజరు నుండి మినహాయించాలని, జగన్ హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టులో హాజరుకావాలంటే ముఖ్యమంత్రి హోదాలో ఉన్నందున భద్రత దృష్ట్యా చాలా డబ్బు వృథా అవుతోందని జగన్ తరఫున్యాయవాదులు తమ వాదనలు వినిపించారు.
జగన్‌కు వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇవ్వడం వల్ల అతని కేసులు, సాక్షులపై ప్రభావం చూపే అవకాశం ఉందని కోర్టుకు సీబీఐ వాదనలు వినిపించింది. జగన్ గతంలో ఎంపీగా ఉన్నపుడే సాక్షులను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారని పేర్కొంది. ముఖ్యమంత్రి హోదాలో జగన్ ఉన్నారని, అధికారులు అంతా ఆయన చెప్పినట్టే వినాల్సి ఉంటుందని, ఆయనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇస్తే తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని సీబీఐ వాదించింది. అప్పటికీ ఇప్పటికీ పరిస్థితుల్లో మార్పులు తప్ప, నేరంలో ఎలాంటి మార్పు లేనేలేదని సీబీఐ పేర్కొంది. తీవ్రమైన ఆర్థిక నేరాలకు పాల్పడిన వారికి ఎలాంటి మినహాయింపులు ఇవ్వవద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందని సీబీఐ పేర్కొంది. గతంలోనూ జగన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను సీబీఐ కోర్టు కొట్టివేసిందని, ఆ తర్వాత జగన్ హైకోర్టును ఆశ్రయించారని, కానీ హైకోర్టు అతని అభ్యర్థనను ఆమోదించలేదని సీబీఐ పేర్కొంది.