క్రైమ్/లీగల్

తప్పుడు లెక్కలొద్దు.. సమగ్ర నివేదికివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 1: ఆర్టీసీ కార్మికుల సమ్మె అంశంపై హైకోర్టులో శుక్రవారం నాడు విచారణ కొనసాగింది. ప్రభుత్వం తరఫున ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ సునీల్ శర్మ సమర్పించిన అఫిడవిట్‌పై హైకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. నివేదిక అసమగ్రంగా, తప్పుడు లెక్కలతో ఉందని, న్యాయస్థానానికి సైతం సరైన రీతిలో వాస్తవాలు చెప్పకపోతే ఎలా అని అసహనం వ్యక్తం చేసింది. సమగ్ర నివేదికలతో కోర్టు ముందు హాజరుకావాలని పేర్కొంటూ తదుపరి విచారణను ఏడో తేదీకి వాయిదా వేసింది. ఆర్టీసీ ఉద్యోగుల జీతాల చెల్లింపు, అద్దె బస్సుల కొనుగోలు, డిమాండ్లపై వేర్వేరుగా దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా హైకోర్టు పలు అంశాలను లేవనెత్తింది. ఆర్టీసీకి బకాయిలన్నీ చెల్లించామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోందని, జీహెచ్‌ఎంసీ కూడా 360 కోట్ల రూపాయిలు చెల్లించామని చెబుతోందని, ఇందులో వాస్తవం ఎంత ఉందో గణాంకాలతో హాజరుకావాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు సునీల్ శర్మ కోర్టు ముందు వివరాలు ఉంచారు. అయితే, ఈ నివేదికలో వాస్తవిక లెక్కలు లేవని హైకోర్టు వ్యాఖ్యానించింది. కోర్టుకు సమర్పించే నివేదికలు ఇలాగే ఇస్తారా, ఇద్దరు ఐఏఎస్‌లు వచ్చి ఇచ్చిన నివేదికలు ఇలా అస్పష్టంగా ఉంచడం ఆశ్చర్యంగా ఉందని పేర్కొంది. ఉద్దేశ్యపూర్వకంగా వాస్తవాలు దాచి నివేదికలు ఇస్తున్నారేమోనని భావించాల్సి వస్తుందని, ఐఏఎస్ అధికారులు గణాంకాలతో గందరగోళం ఎందుకు సృష్టిస్తున్నారని అన్నారు. బకాయిలు ఉన్నాయా? లేదా? బకాయిలు ఉంటే ఎంత చెల్లించారు? ఇంకా ఎంత చెల్లించాలి అనే విషయం చెప్పడానికి లేనిపోని అంశాలను ఎందుకు నివేదికలో చేర్చారని కోర్టు ప్రశ్నించింది. డీజిల్, వేతనాల చెల్లింపునకు రాయితీల బకాయిలు వాడామని ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ ఇచ్చిన వివరణపై న్యాయమూర్తి అనేక ప్రశ్నలు వేశారు. హైదరాబాద్‌లో ఆర్టీసీ నష్టాలను జీహెచ్‌ఎంసీ భరించాలని చట్టంలో ఎక్కడా లేదని ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ నివేదికలో పేర్కొన్న అంశంపై కోర్టు తీవ్రంగా స్పందించింది. ఆర్టీసీకి జీహెచ్‌ఎంసీ చెల్లించాల్సిన అవసరం లేనపుడు ఇంత కాలం జీహెచ్‌ఎంసీ ఎందుకు చెల్లించిందని న్యాయమూర్తి ప్రశ్నించారు. 2018-19 సంవత్సరానికి ప్రభుత్వం నుండి రాయితీల సొమ్ము 644.51 కోట్లు రావల్సి ఉండగా, మొత్తం సొమ్మును చెల్లించినట్టు అఫిడవిట్‌లో ఎలా పేర్కొంటారని ప్రశ్నించారు. 2018-19 ఏడాదిలో ఆర్టీసీకి రావాల్సిన నిధుల అంశంపై జీహెచ్‌ఎంసీకి లేఖ రాశారా? జీహెచ్‌ఎంసీ చెల్లించకుంటే ప్రభుత్వానికైనా లేఖ రాశారా? అని కోర్టు ప్రశ్నించింది. జీహెచ్‌ఎంసీ 2015-16 సంవత్సరానికి 550 కోట్ల లోటు బడ్జెట్‌లో ఉందని, అయినా 2015-16లో 108 కోట్లు, ఆ తర్వాతి సంవత్సరంలో 228 కోట్లు ఎలా చెల్లించిందని న్యాయస్థానం ప్రశ్నించింది. ఆనాడే ఇవ్వగా, ఇపుడు ఎందుకు జీహెచ్‌ఎంసీ ఆదాయం బాగానే ఉన్నా ఎందుకు బకాయిలు చెల్లించలేకపోతోందని కోర్టు ప్రశ్నించింది. బస్సుల కొనుగోలు కోసం కేటాయించిన రుణాన్ని రాయితీ బకాయిలు చెల్లింపుగా ఎలా పేర్కొంటారని ప్రశ్నించింది. జీహెచ్‌ఎంసీ అధికారులు బకాయిలు చెల్లించాలా? లేదా? అనేది అధికారులు తేల్చాలని కోర్టు పేర్కొంది. ఆర్టీసీకి బకాయిలు చెల్లించాల్సి ఉందని అసెంబ్లీలో రవాణా మంత్రి చెప్పారన్న అంశం కార్మికుల తరఫున హాజరైన న్యాయవాది ప్రకాష్‌రెడ్డి కోర్టు దృష్టికి తెచ్చారు. అసెంబ్లీ నివేదికగా మంత్రి తప్పుడు ప్రకటన చేస్తారని తాము అనుకోవడం లేదని న్యాయస్థానం పేర్కొంది. మంత్రి చెప్పింది నమ్మాలా? అధికారులు చెప్పింది నమ్మాలా? అని ప్రశ్నించింది. ఆర్టీసీ తరఫున స్టాండింగ్ కౌన్సిల్ శ్రీ్ధర్ వాదనలు వినిపించారు.