క్రైమ్/లీగల్

యూపీలో విష వాయువుకు ఐదుగురి మృత్యువాత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, నవంబర్ 1: విష వాయువు పీల్చడంతో ఐదుగురు మృత్యువాత పడ్డారు. ఉత్తర్ ప్రదేశ్, సుల్తాన్‌పూర్ జిల్లాలోని ఓ గ్రామంలో మురుగు నీటి ట్యాంక్ మరమ్మత్తులు చేస్తున్న సమయంలో వెలువడిన విష వాయువును పీల్చిన ఐదుగురు కార్మికులు అక్కడికక్కడే మరణించారు. సుల్తాన్‌పూర్ జిల్లా, దోస్త్‌పూర్ గ్రామంలోని కట్‌ఘర పట్టి గ్రామంలో ఈ ఘటన జరిగిందని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ హిమాంశు కుమార్ తెలిపారు. మురుగు నీటి ట్యాంక్ నుంచి పైభాగానికి గ్యాస్ పైప్ లేకపోవడం వల్ల ఈ దుర్ఘటన జరిగిందన్నారు. ట్యాంక్ మరమ్మత్తులు చేపట్టేందుకు ఆరుగురు కార్మికులు దిగారని, ఇంతలో వెలువడిన విష వాయువుతో వారు అపస్మారక స్థితిలోకి వెళ్ళారని ఆయన తెలిపారు. ఈ విషయం తెలియగానే సంబంధిత అధికారులు అక్కడికి చేరుకుని వారిని ఆసుపత్రికి తరలించడం జరిగిందన్నారు. వీరిలో ఐదుగురు మరణించినట్లు ఆయన చెప్పారు. మరణించిన వారు రాజేంద్ర నిషాద్ 32, అశోక్ నిషాద్ 40, రాజేంద్ర నిషాద్ (25), మహ్మద్ షరీఫ్ (52), రాం కిషన్ (40)గా గుర్తించామని ఆయన తెలిపారు. ఈ దుర్ఘటన పట్ల ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మరణించిన వారి పట్ల ఆయన సంతాపం తెలిపారు. మరణించిన వారి కుటుంబ సభ్యులతు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాల్సిందిగా ఆయన అధికారులను ఆదేశించారు.
ఈఎస్‌ఐ కుంభకోణంలో