క్రైమ్/లీగల్

కోర్టు ప్రాంగణంలోనే ఘర్షణలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు ప్రాంగణం శనివారం పోలీసులకు, లాయర్లకు మధ్య తీవ్ర ఘర్షణలకు కేంద్రమైంది. ఈ ఘర్షణల్లో 9 పోలీస్ వాహనాలు ధ్వంసమయ్యాయి. పోలీసులు జరిపిన కాల్పుల్లో తమ సహచరులిద్దరు గాయపడ్డారని లాయర్లు చేసిన ఆరోపణలను అధికారులు తిరస్కరించారు. అసలు తాము కాల్పులే జరపలేదని స్పష్టం చేశారు. ఈ సంఘటనను ఖండించిన బార్ అసోసియేషన్లు 4వ తేదీన ఢిల్లీ అంతటా జిల్లా కోర్టుల్లో సమ్మె నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఒక లాయర్ కారు పోలీస్ జైలు వ్యాన్‌ను ఢీకొనడంతో వాదోపవాదాలు మొదలయ్యాయి. ఆ లాయర్‌ను లాకప్‌లో పెట్టిన పోలీసులు చితకబాదారని తీస్ హజారీ బార్ అసోసియేషన్ కార్యదర్శి జల్వీర్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఆ సమయంలో స్టేషన్ హౌస్ అధికారి వచ్చినప్పటికీ అతనిని లోపలికి అనుమతించలేదని అన్నారు. ఆ తర్వాత పలువురు జిల్లా న్యాయమూర్తులు స్టేషన్‌కు వెళ్లినప్పటికీ సదరు లాయర్‌ను విడిపించలేకపోయారని చౌహాన్ తెలిపారు. 20 నిమిషాల తర్వాత పోలీసులు నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారని, అది కూడా సంఘటన స్థలం నుంచి న్యాయమూర్తులు వెళ్తున్న సమయంలోనే జరిగిందని అన్నారు. ఈ కాల్పుల్లో అనేకమంది లాయర్లు గాయపడ్డారని, రంజీత్ సింగ్ అనే న్యాయవాదికి తూటా తగిలిందని ఆయన తెలిపారు. కాగా, ఘర్షణ సమయంలో ఓ పోలీస్ వాహనాన్ని దగ్ధం చేశారని, మరో 8 వాహనాలను ధ్వంసం చేశారని అధికారులు తెలిపారు. మంటలను ఆపేందుకు అగ్నిమాపక విభాగం 10 ఫైర్ టెండర్లను అందుబాటులోకి తెచ్చింది. ఘర్షణ అనంతరం ఆ ప్రాంతంలో భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. ఇందుకు బాధ్యులైనవారిపై చర్యలు తీసుకోవాలని, కోర్టు గేటు బయట ముందే లాయర్లు ధర్నాకు దిగారు. ఎలాంటి కవ్వింపు లేకుండా కోర్టు ప్రాంగణంలో లాయర్లపై పోలీసులు చేసిన అమానుష దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఢిల్లీ బార్ కౌన్సిల్ చైర్మన్ కేసీ మిట్టల్ అన్నారు. ఈ దాడిలో గాయపడ్డ లాయర్ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, ఒక యువ లాయర్‌ను లాకప్‌లో పెట్టి కొట్టారని తెలిపారు. ఇందుకు పాల్పడినవారిని వెంటనే డిస్మిస్ చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

*చిత్రం...ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు ప్రాంగణంలో లాయర్లకు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణలో దగ్ధమైన ఓ పోలీస్ వాహనం