క్రైమ్/లీగల్

భారీగా నకిలీ నోట్లు పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం: ఖమ్మం జిల్లాలో నకిలీనోట్ల ఎరవేస్తూ భారీ మోసాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. శనివారం కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలను ఖమ్మం పోలీస్‌కమిషనర్ తఫ్సీర్ ఇక్భాల్ వెల్లడించారు. సత్తుపల్లి మండలం గౌరిగూడెం గ్రామానికి చెందిన షేక్ మదార్(56) పాలు, కోళ్ళవ్యాపారం చేస్తున్నట్టుగా ప్రజలను మభ్యపెట్టేవాడు. బంధువులు, స్నేహితులతో కలిసి ఒక ముఠాగా ఏర్పడి 2లక్షలు అసలు నోట్లు ఇస్తే 5లక్షలు నకిలీనోట్లు ఇస్తామని అమాయక ప్రజలను మోసం చేసేవాడు. ప్రజలను మధ్యవర్తుల ద్వారా నమ్మించి వారి వద్ద నుండి అసలు డబ్బులు తీసుకున్న తర్వాత నకిలీనోట్లు ఇవ్వకుండా మోసం చేసేవాడు. అతని మోసాలకు గురై ఎవరైనా ఎదురుతిరిగితే కత్తులతో చంపుతానని బెదిరించేవాడు. మదర్ భార్య మస్తాన్‌బీ, కొడుకు రమీజ్, మేనల్లుడు శౌషద్, తోట హనుమంతరావు, అఖిల్, గాయం వెంకటనారాయణ, మడెం సారయ్యలతో కలసి ఈ తరహ మోసాలకు పాల్పడుతూ లక్షల రూపాయలు సంపాదించారు. తన వద్ద బ్లాక్‌మనీ ఉన్నదని నమ్మించేందుకు ఒకపెట్టెను తయారు చేసి ఆ పెట్టెలో పిల్లలు ఆడుకునే, సినిమావాళ్ళు ఉపయోగించే నకిలీ కరెన్సీ నోట్లు ఉంచి వీడియోతీసి చూపిస్తూ మోసాలకు పాల్పడేవాడు. ఖమ్మం జిల్లాకు సరిహద్దులో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని ఈ తరహా మోసాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించి అతడి గుట్టు రట్టు చేశారు. ఇటువంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని సీపీ పేర్కొన్నారు. కాగా ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న పోలీస్ అధికారులను అభినందించారు. సమావేశంలో నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న 2వేల రూపాయల నకిలీనోట్ల 350కట్టలను ఆయన మీడియాకు చూపించారు. వీరిపై గతంలో పలు పోలీస్‌స్టేషన్లలో కేసులు కూడా నమోదు అయినట్లు తెలిపారు. సమావేశంలో అడిషనల్ డీసీపీలు మురళీధర్, పూజ పాల్గొన్నారు.
*చిత్రం...పట్టుబడిన నకిలీ నోట్లు