క్రైమ్/లీగల్

నేర తీవ్రత వల్ల బెయిల్ ఇవ్వొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 2: ఐఎన్‌ఎక్స్ మీడియా మనీలాండరింగ్ కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పి.చిదంబరం బెయిల్ పిటిషన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శనివారం వ్యతిరేకించింది. చిదంబరం పాల్పడినట్టు అభియోగాలు గల నేరాల తీవ్రత దృష్ట్యా అతనికి ఊరట పొందే హక్కు లేదని ఈడీ ఢిల్లీ హైకోర్టులో వాదించింది. 74 ఏళ్ల చిదంబరం పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌పై ఈడీ తన వైఖరిని తెలియజేస్తూ ఒక అఫిడవిట్ సమర్పించింది. చిదంబరం తన బెయిల్ పిటిషన్‌లో చేసిన వాదన చట్ట ప్రకారం అంగీకారయోగ్యం కాదని, అందువల్ల అతని అభ్యర్థన తిరస్కరణయోగ్యమైనదని ఈడీ తన అఫిడవిట్‌లో వాదించింది. న్యాయమూర్తి సురేశ్ కైట్ ఎదుట సోమవారం ఈ అంశంపై విచారణ జరుగుతుంది. న్యాయమూర్తి సురేశ్ కైట్ ఆదేశం మేరకే ఈడీ చిదంబరం బెయిల్ పిటిషన్‌పై కౌంటర్ అఫిడవిట్ సమర్పించింది. ఐఎన్‌ఎక్స్ మీడియా అవినీతి కేసులో సుప్రీంకోర్టు చిదంబరంకు బెయిల్ మంజూరు చేస్తూ అక్టోబర్ 22న ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఈడీ నమోదు చేసిన ఐఎన్‌ఎక్స్ మీడియా మనీలాండరింగ్ కేసులో ఆయన జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైలులో ఉన్నారు. జీర్ణకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చిదంబరం తాత్కాలిక బెయిల్ కోసం పెట్టుకున్న పిటిషన్‌ను హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది. చిదంబరం ఉండే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, అతనికి శుద్ధిచేసిన మంచినీటిని సమకూర్చాలని, ఇంటి భోజనాన్ని అనుమతించాలని, దోమల నుంచి రక్షణకు వలలను, మశక వికర్షకాలను సమకూర్చాలని హైకోర్టు తీహార్ జైలు అధికారులను ఆదేశించింది.