క్రైమ్/లీగల్

గుంతలో పడి యువతి దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సైదాబాద్, నవంబర్ 3: నగర రహదారులపై గుంతలు పూడ్చడంలో అధికారుల నిర్లక్ష్యం ఓ యువతిని బలికొంది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువతి రహదారిపై ఉన్న గుంతలో పడి అదుపుతప్పి కింద పడటంతో వెనుకగా వచ్చిన ప్రైవేట్ బస్సు ఢీకొట్టి దుర్మరణం చెందింది. చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఘటన వివరాలు ఈవిధంగా ఉన్నాయి.
రంగారెడ్డి జిల్లా కొండూరుకు చెందిన ప్రసాద్ గౌడ్ తన ముగ్గురు కుమార్తెల చదువుల నిమిత్తం నగరానికి వచ్చి సైదాబాద్ కాలనీలో ఉంటున్నారు. ప్రసాద్ గౌడ్ భార్య అనారోగ్యంతో సంవత్సరన్నర క్రితం మరణించింది. అమ్మాయిల బాధ్యత అతనే చూసుకుంటున్నాడు. రెండో కుమార్తె కావ్య(23) ఏంబీఏ పూర్తి చేసింది. శనివారం బ్యాంక్ ఉద్యోగం కోసం నిర్వహించే పోటీ పరీక్ష రాసేందుకు ఉదయం సోదరుడు శివసాయి గౌడ్‌తో ద్విచక్ర వాహనంపై అల్వాల్ వెళ్లేందుకు బయలుదేరింది. నల్గొండ చౌరస్తా సుప్రభాత్ హోటల్ సమీపంలో వారి వెళ్తున్న ద్విచక్ర వాహనం రహదారిపై ఉన్న గుంతలో పడి అదుపు తప్పి కిందపడి పోయారు. అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న ప్రైవేట్ బస్సు వచ్చి కావ్య పైనుంచి వెళ్లింది. తీవ్ర రక్త స్రావాలతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. రహదారిపై ప్రమాదకరంగా గుంత ఉండటమే ఆమె మరణానికి కారణమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేసారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.