క్రైమ్/లీగల్

జగ్గయ్యపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం:ఐదుగురు దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగ్గయ్యపేట రూరల్, నవంబర్ 3: విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు రవాణా చెక్‌పోస్ట్ సమీపంలో ఆదివారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు. చిల్లకల్లు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుండి నారపోగు గోపయ్య, షేక్ మన్సూర్, పోతుల భీమిరెడ్డి, మోట్లంపల్లి భీమిరెడ్డి, విస్రం కోటేశ్వరరావు విజయవాడలో శ్రీ కనకదుర్గమ్మ దర్శనం కోసం తెల్లవారుజామున కారులో బయలుదేరారు. ఉదయం 8గంటల సమయంలో వీరు ప్రయాణిస్తున్న మారుతీ షిఫ్ట్ కారు అదుపుతప్పి అతి వేగంగా డివైడర్‌ను ఢీకొట్టింది. డివైడర్‌ను దాటేసి విజయవాడ వైపు నుండి హైదరాబాద్ వైపు వెళుతున్న మారుతీ ఎర్తికా కారుపైకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో రెండు కార్లు ధ్వంసమయ్యాయి. మారుతీ షిఫ్ట్ కారులోని ఆరుగురు వ్యక్తుల్లో కారుడ్రైవర్ గోపయ్య, షేక్ మన్సూర్ ప్రమాదస్థలిలోనే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురు వ్యక్తులను హైవే అంబులెన్స్‌లో జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో పోతుల భీమిరెడ్డి, మోట్లంపల్లి భీమిరెడ్డి స్థానికంగా చికిత్స పొందుతూ మృతి చెందారు. విస్రం కోటేశ్వరరావును విజయవాడ తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు వివరించారు. మృతుల్లో నలుగురు తెలంగాణ రాష్ట్రంలోని నాగులవంచ, హైదరాబాద్, మహబూబ్‌నగర్‌కు చెందినవారు కాగా, ఒకరిని కర్ణాటకకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. వీరిలో మన్సూర్ వివాహితుడు. మిగిలిన వారు అవివాహితులు. ప్రమాద సమయంలో హైదరాబాద్ వైపు వెళ్తున్న ఎర్తికా కారు బెలూన్‌లు తెరుచుకోవడంతో దానిలో ప్రయాణిస్తున్న గుంటూరు జిల్లా వజినేపల్లికి చెందిన ఇద్దరు వ్యక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ దుర్ఘటనతో హైవే ప్రాంతం బీభత్సంగా మారింది. జగ్గయ్యపేట సీఐ నాగేంద్రబాబు, చిల్లకల్లు, జగ్గయ్యపేట ఎస్‌ఐలు అభిమన్యు, ధర్మరాజు, చిల్లకల్లు ఏఎస్‌ఐ మాంగ్యనాయక్ సిబ్బందితో కలిసి హుటాహుటిన దుర్ఘటన స్థలికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో దెబ్బతిన్న రెండు కార్లను పొక్లెయిన్ సహాయంతో పక్కకు తొలగించారు. మృతులంతా 25 నుంచి 30 ఏళ్ల వయస్సు కలిగిన వారే. ఈ సమాచారం కుటుంబ సభ్యులు, బంధువులకు తెలియజేసేందుకు పోలీసులకు మధ్యాహ్నం వరకు సమయం పట్టింది. ప్రమాద ఘటనపై చిల్లకల్లు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
*చిత్రం... రెండు కార్లు ఢీకొన్న దుర్ఘటన స్థలం