క్రైమ్/లీగల్

కన్నతల్లినే కడతేర్చాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడ్వాయి, నవంబర్ 3: కన్నతల్లిని సాక్షాత్తూ కన్నకొడుకే హతమార్చిన సంఘటన కామారెడ్డి జిల్లాలోని తాడ్వాయి మండలం చిట్యాల గ్రామంలో సంచలనం రేపింది. ఎల్లారెడ్డి డీఎస్పీ శశాంక్‌రెడ్డి కథనం ప్రకారం ఈసంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చిట్యాల గ్రామానికి చెందిన గణపురం సాయవ్వ (47)ను ఆమె కన్న కొడుకు మల్లేశం కర్రతో తలపగులకొట్టి హత్య చేశాడు. తల్లీ కొడుకుల మధ్య గత కొంతకాలంగా ఆస్తుల గొడవ జరుగుతోంది. 15 రోజుల క్రితం సాయవ్వ తన కుమారున్ని కొంతమందితో కలిసి చంపేందుకు నాటుబాంబులను వాడి హత్యా యత్నం చేసింది. ఈ కేసులో కొడుకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తల్లి సాయవ్వపై కేసు నమోదు చేసి సాయవ్వతో పాటు నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరిలించారు. 14 రోజులు జైల్లో ఉన్న సాయవ్వ శనివారం బెయిల్‌పై ఇంటికి వచ్చి మళ్లీ కుమారుడితో తనను అడగకుండా మొక్కజొన్నను ఎందుకు కొట్టించావ్ అని గొడవకు దిగింది. మళ్లీ కుమారున్ని చంపుతానంటూ బెదిరించింది. దీంతో కోపం పట్టలేని మల్లేశ్ తల్లి తలపై కర్రతో బాదడంతో తల పగిలి సాయవ్వ చనిపోయింది. దీంతో మల్లేష్ అక్కడి నుండి పారిపోయాడని డీఎస్పీ వెల్లడించారు. మృతురాలి భర్త నర్సయ్య ఫిర్యాదు మేరకు సీఐ వెంకట్, తాడ్వాయి ఎస్‌ఐ కృష్ణమూర్తి కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కామారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
*చిత్రం...తాడ్వాయి మండల చిట్యాలలో రక్తపు మడుగులో పడి ఉన్న గణపురం సాయవ్వ