క్రైమ్/లీగల్

‘తీస్ హజారి’పై స్పందించిన హైకోర్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 3: ఢిల్లీలోని తీస్ హజారి కోర్టు వద్ద న్యాయవాదులకు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణపై ఢిల్లీ హైకోర్టు ఆదివారం కేంద్ర ప్రభుత్వానికి, ఢిల్లీ పోలీసు కమిషనర్‌కు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. ఈ సంఘటనపై తమ వైఖరిని తెలియజేయాల్సిందిగా హైకోర్టు నోటీసుల్లో ఆదేశించింది. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీఎన్ పటేల్ నేతృత్వంలోని ధర్మాసనం మీడియాలో వచ్చిన వార్తల ద్వారా ఈ ఘటన గురించి తెలుసుకొని తనంత తానుగా నోటీసులు జారీ చేసింది. అలాగే ఈ అంశంపై అత్యవసర విచారణ జరపాలని నిర్ణయించింది. ఆదివారం మధ్యాహ్నం సుమారు ఒంటి గంటకు ధర్మాసనం ఈ అంశంపై విచారణ ప్రక్రియను ప్రారంభించి, సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేసింది. ఘర్షణల్లో పాల్గొన్న పోలీసు అధికారులు మూడు గంటలకు జరిగే విచారణకు హాజరు కావాలని కూడా హైకోర్టు ఆదేశించింది. ఢిల్లీ పోలీస్ తరపున న్యాయవాది రాహుల్ మెహ్రా, ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ తరపున సీనియర్ న్యాయవాది మొహిత్ మాథుర్ హాజరయ్యా రు. ఉద్రిక్త పరిస్థితిని తొలగించాలని తాను కోరుకుంటున్నట్టు ధర్మాసనం పేర్కొంది. శనివారం సాయంత్రం నాలుగు గంటల పాటు సమావేశమైన న్యాయమూర్తులు పరిస్థితిని చక్కదిద్దడానికి తిరిగి ఆదివారం ఉదయం నుంచి ఇక్కడే ఉన్నారు. హైకోర్టు ధర్మాసనం ఢిల్లీ బార్ కౌన్సిల్‌కు, ఢిల్లీ జిల్లా కోర్టులకు చెందిన అన్ని బార్ అసోసియేషన్లకు కూడా నోటీసులు జారీ చేసింది. ఇక్కడి తీస్ హజా రి కోర్టు ఆవరణలో శనివారం మధ్యాహ్నం న్యాయవాదులు, పోలీసులు ఘర్షణ పడగా పోలీసు సిబ్బంది, అనేక మంది న్యాయవాదులు గాయపడ్డారు.
17 వాహనాలు ధ్వంసమయ్యాయని అధికారులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.