క్రైమ్/లీగల్

పురోహితుడిపై దాడి కేసులో నలుగురు మహిళల అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ పశ్చిమ, నవంబర్ 3: భవానీపురం హౌసింగ్‌బోర్డు కాలనీలోని సాయి త్రిశక్తి నిలయం పురోహితునిపై దాడికి పాల్పడిన కేసులో నలుగురు మహిళలను భవానీపురం పోలీసులు ఆదివారం ఉదయం అరెస్ట్ చేశారు. కాగా అరెస్ట్ చేసిన వారిని పోలీసు స్టేషన్‌కు తీసుకురావడానికి యత్నించిన మహిళా ఏఎస్‌ఐ శివకుమారి, మహిళా కానిస్టేబుల్ రత్నకుమారిపై నిందితులు తిరగబడ్డారు. పోలీసులు వారిని స్టేషన్‌కు తరలించే ప్రయత్నంలో విధులకు ఆటంకం కలిగించటమే గాకుండా చేతులతో చెంపలపై కొట్టారు. అలాగే ఈ దాడిని నివారించటానికి యత్నించిన మహిళా ఎఎస్‌ఐ చేతి వేళ్లను అపర్ణ అనే నిందితురాలు కొరికింది. చేతికి గాయమై వెంటనే ఇన్‌ఫెక్షన్ కావటంతో శివకుమారి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేయించుకుంది. ఇదిలా ఉండగా పూజారిపై విచక్షణా రహితంగా దాడి చేయటం గాకుండా పథకం ప్రకారం కళ్లల్లో కారం కొట్టి అవమానకరంగా వస్త్రాలను చించిన సంఘటనలో నలుగురు నిందితులైన ఆనం పూర్ణిమరెడ్డి, ఆనం చెంచులక్ష్మీ, కుమారి, అపర్ణను పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అయినా గానీ వారిని అదుపు చేయటం పోలీసులకు తల ప్రాణం తోకకొచ్చింది. ఎట్టకేలకు వారిని అదుపులోకి తీసుకుని వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌కు తరలించి, అక్కడి నుంచి కోర్టుకు హాజరుపర్చారు.