క్రైమ్/లీగల్

సముద్ర స్నానాల ప్రారంభంలోనే అపశ్రుతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటర్), నవంబర్ 3: కార్తీక మాసం పవిత్ర సముద్ర స్నానాల ప్రారంభంలోనే మంగినపూడి బీచ్ వద్ద అపశృతి చోటు చేసుకుంది. తొలి ఆదివారం జిల్లా నలుమూలల నుండి వేలాది మంది భక్తులు, సందర్శకులు మంగినపూడి బీచ్‌కు వచ్చారు. అంతా సందడి వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఆదివారం బీచ్ పార్కింగ్ ప్రాంత సమీపంలో ఆటో, కారు ఢీకొన్న ప్రమాదంలో మూడేళ్ల చిన్నారి అక్కడిక్కడే దుర్మరణం చెందడం అందరినీ కలచి వేసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కంకిపాడు మండలం ఉప్పులూరు గ్రామానికి చెందిన కొలుసు మురళి - అనూషల మూడేళ్ల కుమార్తె ఆద్య ఈ ప్రమాదంలో మృతి చెందింది. గొడుగుపేటలో ఉంటున్న అమ్మమ్మ శివ పార్వతి తన మనుమరాలు ఆద్యను ఆటోలో మంగినపూడి బీచ్‌కు తీసుకు వచ్చింది. పార్కింగ్ స్థలం వద్ద ఆటోలో నుండి ముందుగా చిన్నారి ఆద్య దిగింది. ఆ క్షణమే ఆటో వెనుక ఉన్న కారును వేరొక కారు వచ్చి ఢీకొంది. దీంతో ఆగి ఉన్న కారు, ఆటో మధ్య నలిగి చిన్నారి ఆద్య అక్కడిక్కడే ప్రాణాలు విడిచింది. అప్పుడే ఆటో దిగుతున్న అమ్మమ్మ శివ పార్వతి స్వల్పంగా గాయపడింది. విషయం తెలుసుకున్న బందరు తాలుకా ఎస్‌ఐ నరసింహమూర్తి ఘటనా స్థలికి వెళ్లి ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చిన్నారి అమ్మమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నరసింహమూర్తి తెలిపారు.