క్రైమ్/లీగల్

6లోగా వాస్తవ పరిస్థితులపై నివేదిక ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెపై రాష్ట్ర హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 6వ తేదీలోగా సమ్మెపై వాస్తవ నివేదికను సమర్పించాలని ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ సునీల్‌శర్మను హైకోర్టు ఆదేశించింది. దీంతో ప్రభుత్వం తదుపరి హైకోర్టుకు సమర్పించనున్న నివేదికపై సమగ్రమైన సమాచారాన్ని అందివ్వడానికి కసరత్తు చేపట్టింది. ఈనెల 7వ తేదీన సమ్మెపై హైకోర్టు విచారణ చేపట్టనున్నది. ఈ విచారణకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి. ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ సునీల్‌శర్మ, జీహెఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ స్వయంగా హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది.
హైకోర్టు కీలక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ప్రభుత్వ నివేదికపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. ఆర్టీసీ సమ్మె చేపట్టి నేటికి 31 రోజలు గడుస్తున్నాయి. దీంతో ఇటు ప్రభుత్వం అటు హైకోర్టు వాదనల మధ్య ఎలాంటి సానుకూల నిర్ణయం ఉంటుందోనిన జెఏసీ నేతలు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి, ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ సునీల్‌శర్మ, ఆర్థిక ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేష్‌కుమార్ ఈనెల 7న హైకోర్టుకు హాజరు కాకతప్పలేదు. ఈనెల 1వ తేదీన సమ్మెపై హైకోర్టులో విచారణ అనంతరం కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ సునీల్‌శర్మ ఉద్ధేశ్యపూర్వకంగా అబద్దాల అఫిడవిట్‌ను కోర్టుకు సమర్పించారని ధర్మాసనం అభిప్రాయపడింది. వాస్తవానికి విరుద్దంగా నివేదిక ఉందని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఆర్థిక శాఖ ఇచ్చిన నివేదిక, రవాణాశాఖ మంత్రికి ఇచ్చిన నివేదిక విరుద్దంగా ఉన్నాయని కోర్టు స్పష్టం చేసింది. ఈనెల 6న ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ సునీల్‌శర్మ తదుపరి నివేదికను కోర్టుకు సమర్పించనున్నారు. 2018-2019 ఆర్థిక సంవత్సరంలో జీహెచ్‌ఎంసీ నుంచి ఆర్టీసీకి రావాల్సిన బకాయిలు ఏమేరకు ఉన్నాయో తేల్చాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
జీహెచ్‌ఎంసీ నుంచి ఆర్టీసీకి రావాల్సిన బకాయిలు కోరితేనే ఇచ్చారా లేక జీహెచ్‌ఎంసీనే బకాయిలను చెల్లించిందా అన్న అంశాలపై వివరాలను కోర్టుకు సమర్పించాలని సూచించింది. 2013-14 నుంచి ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిల వివరాల నివేదికను కోర్టు ముందు ఉంచాలని సూచించింది. ఈనెల 7వ తేదీన ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ సునీల్‌శర్మ స్వయంగా కోర్టు విచారణకు హాజరు కావలని హైకోర్టు ఆదేశించింది. ఆర్టీసీ కార్మిక సంఘాలు 26 డిమాండ్లతో పాటు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని సమ్మెకు జేఏసీ నేతలు పిలుపు ఇచ్చారు.