క్రైమ్/లీగల్

ఉద్యోగాల పేరిట మోసాల ముఠా గుట్టురట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, నవంబర్ 4: టీటీడీలోని అన్నదానం, లడ్డూ కౌంటర్లలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల పేరుతో ఆన్‌లైన్ ద్వారా నిరుద్యోగులను నమ్మించి వారి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్న ముఠాను ఓ బాధితుడి ఫిర్యాదుతో టీటీడీ విజిలెన్స్ అధికారులు గుర్తించారు. వీరిపై ఫిర్యాదు చేయడంతో తిరుపతి ఈస్ట్ పోలీసులు ఇందులో ముగ్గురిని అదుపులోకి తీసుకోగా మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. వివరాల్లోకి వెడితే తిరుపతికి చెందిన లక్ష్మీనారాయణ, కార్తీక్, రాజు అనే వారు టీటీడీలోని అన్నదానం, లడ్డూ కౌంటర్లలో ఉద్యోగాలిప్పిస్తామని ఓఎల్‌ఎక్స్ అనే ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో ప్రకటనలిచ్చారు. వీరు సులభ్ సంస్థలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న శ్రీనివాసులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అలాగే తిరుమలలో లడ్డూ కౌంటర్‌కు ఇండియన్ బ్యాంక్ ద్వారా సిబ్బందిని సరఫరా చేస్తున్న లక్ష్మీ మ్యాన్ పవర్ ఏజెన్సీకి చెందిన మహేష్‌తో మాట్లాడుకున్నారు. వీరిద్దరి సహాయంతో ఉద్యోగాల కోసం తమ వద్దకు వస్తున్న నిరుద్యోగుల నుంచి రూ. 50 వేలు తీసుకుని తిరుమలలోని అన్నదానం, లడ్డూ కౌంటర్లలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను ఇప్పించేవారు. వచ్చిన డబ్బును అందరూ పంచుకునేవారు. కాగా గోపీ సింగ్ అనే నిరుద్యోగికి ఔట్ సోర్సింగ్ సూపర్‌వైజర్ పోస్టు ఇప్పిస్తామని నమ్మించి అతని వద్ద నుంచి ఇదే తరహాలో డబ్బులు తీసుకున్నారు. అయితే అతనికి సులభ్ సంస్థ ద్వారా క్లీనర్ పోస్టు ఇప్పించారు. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించిన గోపి సింగ్ టీటీడీ విజిలెన్స్ అధికారులను ఆశ్రయించాడు. విజిలెన్స్ అధికారులు దీనిపై విచారణ జరిపి తిరుపతి ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో లక్ష్మీనారాయణ, కార్తీక్, రాజు, శ్రీనివాసులపై కేసు నమోదైయ్యింది. కాగా పరారీలో ఉన్న మహేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.