క్రైమ్/లీగల్

కాలువలోకి దూసుకుపోయిన కార్ల కంటైనర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆలమూరు, నవంబర్ 4: తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం జొన్నాడవద్ద జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారు జామున కార్లతో వెళుతున్న కంటైనర్ కాలువలోకి దూసుకుపోయిన ప్రమాదంలో ఇరువురు మృతిచెందారు. పోలీసుల కథనం ప్రకారం చెన్నై నుండి ఒడిస్సాకు హ్యూందై కార్లతో వెళుతున్న కంటైనర్ జొన్నాడ గౌతమి బ్రిడ్జి సమీపంలో అదుపుతప్పి, జాతీయ రహదారి నుండి 40 అడుగుల దిగువకు ఉన్న తూర్పు డెల్టా ప్రధాన కాలువలోకి దూసుకుపోయింది.
ఈ ఘటనలో లారీ కేబిన్ కాలువ నీటిలో మునిగిపోయింది. దీనితో లారీలోవున్న పశ్చిమ బెంగాల్‌లోని సూతి మండలం రాతురి గ్రామానికి చెందిన డ్రైవర్ షేక్ ఓబైదాల్ (27), క్లీనర్ మహ్మద్ గణేష్ హక్ (19) సంఘటనా స్థలంలోనే మృతిచెందారు. ప్రమాదం జరిగిన ప్రదేశం సుమారు నలభై అడుగుల లోతు ఉండడంతో కంటైనర్‌ను బయటకు తీయడానికి 8 గంటల సమయం పట్టింది. మండపేట సీఐ మంగాదేవి, ఆలమూరు ఎస్సై శుభాకర్ ఓఎన్జీసీ అధికారులతో చర్చించి రెండు భారీ క్రేన్‌లను తీసుకువచ్చి కంటైనర్‌ను బయటకుతీశారు. సంఘటనా స్థలాన్ని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి సందర్శించి ప్రమాదంపై జిల్లా ఉన్నతాధికారులతో చర్చించారు. జాతీయ రహదారుల సంస్థ ఐఎంటి మేనేజర్ రవి కొప్పుల, తహసీల్దార్ జవ్వాది వెంకటేశ్వరి ఉదయం నుండి పర్యవేక్షించారు. మృతదేహాలను రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆలమూరు ఎస్సై సుభాకర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
*చిత్రం... కాలువలోకి దూసుకుపోయిన కంటైనర్