క్రైమ్/లీగల్

కలహాలకు బలైపోయిన కుటుంబం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు: కుటుంబ కలహాలతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గరు ఆత్యహత్యకు పాల్పడిన ఘటన చిత్తూరు నగరం ఓబనపల్లి కాలనీలో సోమవారం చోటు చేసుకుంది. ఇందులో భార్యభర్తతో పాటు తొమ్మిది సంవత్సరాల కూతురు మృతి చెందింది. ఈ సంఘటన నగరంలో కలకలం సృష్టించింది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఓబనపల్లికాలనీకి చెందిన జయలక్ష్మి స్థానికంగా ఉన్న ఎల్‌ఐసీ కార్యాలయంలో స్వీపర్‌గా పని చేస్తూ ఇటీవల రిటైర్ అయ్యింది. జయలక్ష్మి కుమారుడైన రవి (50) లారీ డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. గతంలో కుటుంబ కలహాల కారణంగా రవి మొదటి భార్య ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో సుమారు పది సంవత్సరాల క్రితం రవి స్థానికంగా ఉన్న భువనేశ్వరి (45)ని రెండవ వివాహం చేసుకొన్నాడు. వీరికి గాయత్రీ (9) సంవత్సరాల వయస్సు కల్గిన కూతురు ఉంది. రవి తన తల్లితో కలిసి సొంత ఇంటిలోనే కలిసి ఉన్నారు. అయితే రవికి ఇటీవల అప్పులు ఎక్కువ అయ్యాయి. దీంతో తన తల్లి రిటైర్ కావడంతో వచ్చిన సొమ్ములో కొంత తన అప్పులు తీర్చడం కోసం కొంత నగదు ఇవ్వాలని రవి తన తల్లిని అడగడం దీనికి ఆమె అంగీకరించక పోవడంతో తల్లి కొడుకులు మధ్య గొడవలు నెలకొన్నాయి. ఈ నేపధ్యంలో తల్లి పేరుతో ఉన్న ఇంటిని తన పేరుతో వీలునామా రాయాలని తల్లి పై వత్తిడి తెచ్చాడు. అయితే ఇల్లు కుమారుని పేరుతో రాస్తే అమ్మివేస్తాడని భావించిన జయలక్ష్మి ఒప్పుకోక పోవడం, అప్పులు చెల్లిండం రవికి సాధ్యం కాని పరిస్థితి మరో పక్క అప్పులు ఇచ్చిన వారి నుంచి వత్తిడి ఎక్కువైంది. ఈ నేపధ్యంలో జీవితంపై విరక్తి చెందిన రవి, ఆదివారం రాత్రి తన భార్య భువనేశ్వరితో చిర్చించి ఆమెను సైతం అత్మహత్య చేసుకోవడానికి ఒప్పించాడు. ఈక్రమంలో వీరు ఇరువురు కూల్ డ్రింక్‌లో క్రిమిసంహారక మందును కలుపుకొని తాగారు. తాము చనిపోతే బిడ్డ అనాధ అవుతుందని భావించిన భార్యభర్తలు నిద్రపోతున్న కూతురు గాయత్రీ చేత తాగించారు. దీంతో ఆదివారం రాత్రి జయలక్ష్మి ఇంటి మిద్దపైన ఉన్న గదలో నిద్ర పోయి ఉదయం కిందికి వచ్చి చూడగా, ముగ్గరు విగత జీవులుగా పడి ఉండటంతో జయలక్ష్మి స్థానికుల ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృత దేహాలను పోస్టు మార్టుం నిమిత్తం చిత్తూరు ఆసుపత్రికి తరలించారు.
నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
*చిత్రం... ఆత్మహత్మకు పాల్పడిన భువనేశ్వరి, రవి దంపతులు. కుమార్తె గాయత్రి