క్రైమ్/లీగల్

సంస్థ ఎండీకి రూ.1లక్ష టోకరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలానగర్, నవంబర్ 5: తాను పని చేస్తున్న సంస్థ ఎండికే లక్షలాది రూపాయాలు టోకరా వేసిన నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సంఘటన బాలానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. బాలానగర్ పారిశ్రామిక వాడలోని వసంత టూల్స్ యజమాని పేరు ఒకటే కావడంతో దాని అధారంగా చేసుకుని సంస్థలో అకౌంట్స్ విభాగంలో పని చేస్తున్న డీ.అనంద్‌కుమార్ ఎండీ క్రెడిట్ కార్డు ద్వారా రూ.5.20 లక్షల రూపాయాలు తన సొంత ఖర్చుల కోసం వాడుకున్నాడు. క్రెడిట్ కార్డు ద్వారా లావా దేవిలు జరిపించేందుకు ఓటిపి కోసం తన ఫోన్ నంబర్‌ను నమోదు చేయించాడు. కార్డు ద్వారా డబ్బులు డ్రా చేసుకున్నట్లు గ్రహించిన సంస్థ ఎండీ హెచ్‌ఆర్ వినయ్‌కుమార్ పోలీసులకు ఫోన్‌లో సమాచారం అందించారు. దీంతో బాలానగర్ పోలీసులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ఆనంద్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని అతని వద్ద రూ.1500లను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.