క్రైమ్/లీగల్

ట్రాఫిక్ స్పెషల్ డ్రైవ్‌లో 13 బుల్లెట్లు సీజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), నవంబర్ 5: ట్రాఫిక్ స్పెషల్ డ్రైవ్‌లో నగర పోలీసులు నిబంధనలు అతిక్రమించిన బుల్లెట్ వాహనాలను సీజ్ చేశారు. వాయు, శబ్ద కాలుష్యానికి కారణమైన వాహనాలపై దృష్టి సారించిన ట్రాఫిక్ యంత్రాంగం కొద్దిరోజులుగా కమిషనరేట్ పరిధిలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దీనిలోభాగంగా నగరంలోని పలు కూడళ్లలో మంగళవారం వాహనాల తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా సైలెన్సర్లు ఏర్పాటు చేసుకుని శబ్ద కాలుష్యానికి కారణవౌతున్న 13 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. వాహన చోదకులపై కేసులు నమోదు చేసి కౌనె్సలింగ్ నిర్వహించారు. బుల్లెట్ల సైలెన్సర్లు తొలిగించి నిబంధనలకు అనుగుణంగా తయారుచేసిన సైలెన్సర్లను ఏర్పాటు చేయించారు. వాహనాలను పీడబ్ల్యూడీ గ్రౌండ్స్‌కు తరలించారు. వాహనచోదకులకు మోటారు వాహన చట్టాల గురించి అధికారులు వివరించారు. కార్యక్రమంలో సీఐలు ఐడీ సువర్ణరాజు, ట్రాఫిక్ ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.