క్రైమ్/లీగల్

పోలీసుల అదుపులో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగ్‌పూర్, నవంబర్ 6: సహకార బ్యాంకు కుంభకోణంలో కీలక పాత్ర పోషించారన్న ఆరోపణలతో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అశోక్ ధవాడ్‌ను పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టు ముందు ప్రవేశపెట్టగా ఈనెల 13వ తేదీ వరకు ఆయనకు రిమాండ్ విధించింది. నవోదయ అర్బన్ కోపరేటివ్ బ్యాంక్ చైర్మన్‌గా వ్యవహరించిన అశోక్ ధవాడ్ పలు ఆర్థిక నేరాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. 38.75 కోట్ల రూపాయల మేరకు నిధుల గోల్‌మాల్ జరిగినట్టు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. మహారాష్ట్ర డిపాజిట్‌దారుల హక్కుల పరిరక్షణ (ఎంపీఐడీ) చట్టం నిబంధనలకు వ్యతిరేకంగా ఆయన నిర్ణయాలు తీసుకున్నట్టు ఆర్థిక నేరాల విభాగం అధికారులు కోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. అశోక్ ధవాడ్‌ను ప్రశ్నించిన తర్వాత ఆయనపై చార్జిషీట్ దాఖలు చేస్తామని ప్రకటించారు. తనపై అరెస్టు వారెంట్ జారీ అయినందున అశోక్ ధవాడ్ బుధవారం పోలీసులకు లొంగిపోయారు. తక్షణమే పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. చీటింగ్, ఎంపీఐడీ చట్ట ఉల్లంఘన కేసులను పెట్టి కోర్టు ముందు హాజరుపరిచారు. 2010-2017 మధ్యకాలంలో పలువురు బినామీ పేర్లతో రుణాలను మంజూరు చేయించి, వాటిని సొంత లాభాలకు మళ్లించుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ కుంభకోణంపై ప్రాథమిక ఫిర్యాదు అందుకున్న తర్వాత పోలీసులు అశోక్‌పై కేసు నమోదు చేశారు.