క్రైమ్/లీగల్

కాఫర్ డ్యాంపై అధ్యయన కమిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టులోని కాఫర్ డ్యాం నిర్మాణం వల్ల తెలంగాణ, ఒడిశా, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు జరిగే నష్టంపై విచారించేందుకు జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్‌జీటీ) గురువారం నలుగురు సభ్యులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ అధ్యయనం చేసి నివేదిక అందిస్తుంది. కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ బోర్డు, కేంద్ర పర్యావరణ శాఖ, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కమిటీలో సభ్యులుగా ఉంటారు. కాఫర్‌డ్యాం నిర్మాణంతో తెలంగాణ, ఒడిశా, చత్తీస్‌గఢ్‌లపై ప్రభావం పడుతుందా? అన్నదానిపై కమిటీ అధ్యయనం చేస్తుంది. కాఫర్ డ్యాం మూలంగా మూడు రాష్ట్రాల్లో సంభవించే నష్టంతోపాటు చేపట్టవలసిన సహాయక చర్యల గురించి కమిటీ తగు సిఫార్సులు చేస్తుంది. ఇంతవరకూ ఎందుకు అధ్యయనం చేయలేదని ట్రిబ్యునల్ ప్రశ్నించింది. కాఫర్ డ్యాం వల్ల సంభవించే నష్టానికి పోలవరం అథారిటీ పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొంది. ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయవాది శ్రావణ్ వాదిస్తున్నారు.