క్రైమ్/లీగల్

ఏటీఎంలో చోరీకి యత్నించిన ఇద్దరికి రిమాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెహిదీపట్నం, నవంబర్ 7: ఏటీఎం సెంటర్‌లో డబ్బులు కాజేసేందుకు ప్రయత్నించిన ఇద్దరు నిందితులను ఆసీఫ్‌నగర్ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. పశ్చిమ మండల డీసీపీ కార్యాలయంలో వివరాలను డిప్యూటీ కమిషనర్ ఏఆర్ శ్రీనివాస్ వెల్లడించారు. ఆసీఫ్‌నగర్ హైమద్‌నగర్ ప్రాంతానికి చెందిన హైమద్ కుమారుడు ఖలిద్ కమల్ హైమద్ (29) వ్యాపారం. కాగా విజయనగర్ కాలనీ మల్లేపల్లి లక్ష్మీనగర్ ప్రాంతానికి చెందిన మహ్మాద్ షరిఫ్ కుమారుడు మహ్మాద్ రియాజ్ (31) ఫాల్‌సిలింగ్ వర్క్ చేస్తుంటారు. ఇద్దరు మిత్రులు. ఈనెల 3న ఉదయం ఆసీఫ్‌నగర్‌లోని కెనరా బ్యాంక్ ఏటీఎం సెంటర్‌లోని డబ్బులు కాజేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఏటీఎం మిషన్‌ను కొంత ధ్వంసం చేశారు. డబ్బులు రాకపోవడంతో చేసేది ఏమిలేక పారిపోయారు. ఆదివారం ఉదయం ఏటీఎం సెంటర్ రూమ్‌ను పరిశుభ్రం చేసేందుకు వచ్చిన మహిళ గుర్తించి కెనరా బ్యాంక్ అధికారులకు తెలియజేసింది. బ్యాంక్ అధికారులు వచ్చి ఆసీఫ్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా ఖలిద్, రియాజ్‌ను పట్టుకుని విచారించారు. వీరి నుంచి బైక్‌తో పాటు మూడు సెల్‌ఫోన్లును స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. పోలీస్ సిబ్బందికి డిప్యూటీ కమిషనర్‌తో పాటు ఆసీఫ్‌నగర్ ఏసీపీ జీఆర్ శివమారుతి అభినందించారు.