క్రైమ్/లీగల్

కళింగపట్నం బీచ్‌లో ముగ్గురు విద్యార్థుల గల్లంతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం: కార్తీకమాసం రెండవ ఆదివారం కళింగపట్నం-మత్స్యలేశం మధ్య పిక్నిక్‌కు వెళ్లిన విద్యార్థుల్లో నలుగురు గల్లంతయ్యారు. వీరిలో ఒక మృతదేహం లభ్యమైంది. శ్రీకాకుళం నగరం నుంచి సరదాగా గడిపేందుకు కళింగపట్నం పిక్నిక్‌కు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఐదుగురు విద్యార్థులు వెళ్లారు. గార మండలం కళింగపట్నం బీచ్‌లో సాయంత్రం 4గంటల సమయంలో స్నానాలకు దిగారు. ఐదుగురు సముద్రంలోకి దిగగా, అందులో షేక్ అబ్ధుల్ కొట్టుకుపోతుండగా కేకలకు గమనించిన స్థానికులు, పోలీసులు కాపాడారు. మిగిలిన నలుగురు గల్లంతు కావడంతో తీరప్రాంతంలో విషాదం నెలకొంది. కళింగపట్నం తీరంలో 80 అడుగుల లోపలికి వెళ్లిన కెరటాల ఉద్ధృతికి మునిగిపోయారు. వెళ్లిన వారిలో శిర్లా ప్రవీణ్‌కుమార్ రెడ్డి అలియాస్ శివరామరెడ్డి, ఏపీ హెచ్‌బీ కాలనీకి చెందిన కురుమూరు సంజయ్, మహాలక్ష్మీనగర్‌కు చెందిన వై.పండా, గుజరాతిపేటలో ఉంటున్న అనపర్తి సుధీర్ గల్లంతయ్యారు. అయితే అనపర్తి సుధీర్(17) మృతదేహం ఒడ్డుకు కొట్టుకు వచ్చింది. మిగిలిన ముగ్గురు కోసం తీవ్రంగా మెరైన్ పోలీసులు గాలిస్తున్నారు. ఘటనా స్థలానికి జిల్లా ఎస్పీ ఆర్‌ఎన్ అమ్మిరెడ్డి, డీఎస్పీ మూర్తి చేరుకొని గల్లంతుకు కారణాలపై ఆరా తీశారు. వీరితోపాటు ఇన్‌ఛార్జి ఎస్సై సింహాచలం, మెరైన్ సిఐ అంబేద్కర్ ఉన్నారు.