క్రైమ్/లీగల్

ఆన్‌లైన్‌లో నగదు మాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెనమలూరు, నవంబర్ 14: ఆన్‌లైన్ ద్వారా చోరీల మాయాజాలం రోజు రోజుకూ పెరిగిపోతోంది. పెనమలూరు స్టేషన్ పరిధిలో ఆన్‌లైన్ చోరీ గురువారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల సమాచారం ప్రకారం గంగూరు గ్రామానికి చెందిన వడ్డీ మోహన కృష్ణ బిగ్ బాస్కెట్ సూపర్ మార్కెట్‌లో పనిచేస్తున్నాడు. అతనికి ఆర్‌బీసీ బ్యాంక్‌లో ఖాతా ఉంది. బ్యాంకు నుండి క్రెడిట్ కార్డు కొత్తగా తీసుకున్నాడు. ఆ కార్డులో తప్పు ఉండటంతో బ్యాంక్‌కు వెళ్లి సమాచారం అందించాడు. బ్యాక్ వారు తరువాత చూద్దాం అన్నారు. అనంతరం బ్యాంక్ నుండి ఫోన్ చేస్తున్నామని చెప్పి కార్డు మార్పు చేయడానికి ఓటీపీ నెంబర్ చెప్పమన్నారు. దీంతో బాధితుడు ఓటీపీ చెప్పిన వెంటనే ఖాతాలో ఉన్న రూ.59,900ల నగదు మాయం అయింది. వెంటనే మోహన్ కృష్ణ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.