క్రైమ్/లీగల్

ఏపీ బాడ్మింటన్ అసోసియేషన్‌లో భారీగా నిధులు గోల్‌మాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), నవంబర్ 19: ఆంధ్రప్రదేశ్ బాడ్మింటన్ అసోసియేషన్‌లో భారీగా నిధులు దుర్వినియోగం చోటు చేసుకున్నట్లు పోలీసులు నిగ్గు తేల్చారు. ఈమేరకు అసోసియేషన్‌లో గత చాలాకాలంగా కీలక పాత్ర వహిస్తూ వస్తున్న కరణం పున్నయ్య చౌదరి ప్రమేయంతోనే ఈ వ్యవహారం జరిగినట్లు దర్యాప్తులో వెల్లడైంది. గత కొద్దిరోజులుగా అసోసియేషన్‌కు సంబంధించిన ఆర్థికపరమైన లావాదేవీలపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ మేరకు చేపట్టిన దర్యాప్తులో పున్నయ్యచౌదరి పాత్ర ఉన్నట్లు నిర్ధారించుకుని మంగళవారం రాత్రి ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. ఏపీ బాడ్మింటన్ అసోసియేషన్‌లో నిధులు దుర్వినియోగమైనట్లు సీనియర్ ఉపాధ్యక్షుడు తేతలి నారాయణరెడ్డి ఈ ఏడాది జూలై 6వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. నేరుగా నగర పోలీసు కమిషనర్ సీహెచ్ ద్వారకా తిరుమలరావును కలిసి కరణం పున్నయ్య చౌదరి, మరికొంతమంది అసోసియేషన్ సభ్యులపై ఆరోపణలు చేయడంతో సీపీ ఆదేశాలతో కేసు నమోదైంది. కాగా దర్యాప్తు చేపట్టిన సీసీఎస్ పోలీసులు క్రైం డీసీపీ కోటేశ్వరరావు పర్యవేక్షణలో క్రైం ఏసీపీ శ్రీనివాసరావు ప్రాథమికంగా నిధులు దుర్వినియోగమైనట్లు నిగ్గు తేల్చారు. ఏపీ బాడ్మింటన్ అసోసియేషన్ నిధులు సుమారు రూ.1.25 కోట్లు గత పది సంవత్సరాల్లో బాడ్మింటన్ అసోసియేషన్ సెక్రటరీ, సీఈఓ హోదాల్లో పని చేసిన కరణం పున్నయ్య చౌదరి తన వ్యక్తిగత బ్యాంకు ఖాతాలకు నిధులు మళ్లించినట్లు నిర్ధారించారు. దీంతో కేసులో ప్రధాన నిందితుడైన పున్నయ్య చౌదరిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. కాగా కేసు దర్యాప్తులో భాగంగా ఇతర నిందితుల పాత్ర గూర్చి విచారణ సాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.