క్రైమ్/లీగల్

ఏసీబీ వలలో వీఆర్‌ఓ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, నవంబర్ 19: రూ.4 వేలు లంచం తీసుకుంటూ వీఆర్‌ఓ ఏసీబీకి చిక్కిన సంఘటన నవాబుపేట్ మండల పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నవాబుపేట్ మండలం చిట్టిగిద్ద గ్రామానికి చెందిన పీ.రాములు మండల పరిధిలోని కొజ్జవనంపల్లి గ్రామ వీఆర్‌వోగా విధులు నిర్వర్తిస్తున్నాడు. కొజ్జవనంపల్లి గ్రామానికి చెందిన బేగరి దావీదు తల్లి పేరు మీద ఉన్న 3.29 ఎకరాల భూమిని విరాసత్ చేయించేందుకు ధరఖాస్తు పెట్టుకున్నాడు. అన్ని పత్రాలు అధికారులు ఆమోదించినా.. ఆన్‌లైన్‌లో నమోదు కాకపోవడంతో రూ.4వేలు లంచం ఇస్తే త్వరగా ఆన్ లైన్‌లో నమోదు చేస్తానని బాధితుడు జావీదుకు తెలిపాడు. విసుగు చెందిన దావీదు కుమారుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో వలపన్ని వీఆర్‌వో రాములును రెడ్ హాండెడ్‌గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు.