క్రైమ్/లీగల్

చట్టసభల్లో పోటీకి నిబంధనలపై పిటిషన్ కొట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 20: చట్టసభల్లో పోటీకి కనీస విద్యార్హత, వయో పరిమితిపై నిబంధనలు అవసరమని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కోట్టివేసింది. ‘పట్ట్భద్రులైనంత మాత్రాన జ్ఞానవంతులు కాదు.. ఉత్సాహానికి వయస్సుతో సంబంధం లేదు’ అంటూ ఈ కేసును ఉటంకిస్తూ హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. జ్ఞాన సముపార్జనకు పట్ట్భద్రులు లేదా పట్ట్భుద్రులు కాని వారు అంటూ ఉండదని.. అలాగని పదో తరగతి చదివిన వారు జ్ఞానవంతులు కాదని చెప్పలేమని హైకోర్టు చీఫ్ జస్టిస్ డీఎన్ పటేల్, జస్టిస్ సీ హరిశంకర్‌ల ధర్మాసనం బుధవారం పేర్కొంది. ఇదే అంశం వయస్సుకూ వర్తిస్తుంది వయస్సు తక్కువ ఉన్నంత మాత్రాన ఉత్సాహవంతులు కారనీ.. ఎక్కువ ఉన్నంత మాత్రాన ఉత్సాహవంతులని ఏ విధంగా చెప్పగలుగుతామని ప్రశ్నించింది. బీజేపీ నాయకుడైన లాయర్ అశ్వినీకుమార్ ఉపాధ్యాయ్ చట్టసభల్లో పోటీ చేసేందుకు కనీస విద్యార్హత, వయో పరిమితి 75 సంవత్సరాలుగా ఉండాలని ప్రభుత్వానికి సూచించాలని పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం.. పార్లమెంట్ దీనిపై నిర్ణయం తీసుకొని లా కమిషన్‌కు ప్రతిపాదించవచ్చని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. లా కమిషన్‌కు సూచించే అధికారం మాకు ఉండదని పేర్కొంటూ.. ఇప్పటికే ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై ఎన్నోసార్లు సంస్కరణలు జరిగాయని చెబుతూ పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది.