క్రైమ్/లీగల్

చిదంబరం బెయిల్ పిటిషన్‌పై మీరేమంటారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో అరెస్టు అయిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం బెయిల్ కోసం చేసుకున్న దరఖాస్తుపై మీ సమాధానం ఏమిటీ? అని సుప్రీం కోర్టు ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని ప్రశ్నించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు బెంచ్ ఈడీకి నోటీసు జారీ చేసింది. ఈ అంశంపై తదుపరి విచారణను ఈ నెల 26వ తేదీకి వాయి దా వేసింది. ఐఎన్‌ఎక్స్ మీడియా మనీ ల్యాండరింగ్ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలంటూ చిదంబరం దాఖలు చేసిన పిటీషన్‌ను హైకోర్టు లోగడ తోసిపుచ్చింది. పైగా చిదంబరం జ్యుడిషీయల్ రిమాండ్‌ను ఈ నెల 27వ తేదీ వరకూ పొడిగించింది. దీంతో చిదంబరం తరఫు న్యాయవాది కపిల్ సిబల్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్.్భనుమతి నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం బుధవారం చిదంబరం బెయిల్ పిటీషన్‌ను విచారణకు స్వీకరించింది. సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, ఏఎం సింఘ్వి చిదంబరం (74) తరఫున బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. 91 రోజులుగా చిదంబరం జైలులోనే ఉన్నారని, కాబట్టి కేసును త్వరితగతిన విచారణ ముగించాలని వారు ధర్మాసనాన్ని కోరారు. అందుకు న్యాయమూర్తులు భానుమతి, ఏఎస్ బొపన్న, హృషికేశ్ రాయ్ స్పందిస్తూ దీనిపై వెంటనే ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ తమ సమాధానం ఇవ్వాలని ఆదేశిస్తూ నోటీసు జారీ చేశారు. ఈడీ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హాజరయ్యారు. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ దీనికి ఈ నెల 25వ తేదీలోగా సమాధానం అందజేస్తామని చెప్పారు. అందుకు కేసు తదుపరి విచారణను 26వ తేదీకి వాయిదా వేసింది. ఐఎన్‌ఎక్స్ మీడియా అవినీతి కేసులో తొలుత సీబీఐ ఆగస్టు 21న అరెస్టు చేసింది. అక్టోబర్ 22న బెయిల్ లభించినా, మనీ ల్యాండరింగ్ కేసులో అక్టోబర్ 16 నుంచి నవంబర్ 27వ తేదీ వరకు జ్యుడిషీయల్ కస్టడీకి ట్రయల్ కోర్టు అప్పగించింది. విదేశీ పెట్టుబడుల ప్రమోషన్ బోర్డు (ఎఫ్‌ఐపీబీ) కేసులో 2017 సంవత్సరం మే 15న సీబీఐ కేసు నమోదు చేసింది. ఇందులో చిదంబరం మంత్రిగా ఉన్నప్పుడు అవకవతవకలు జరిగాయని, రూ.305 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చాయి. లోగడ హైకోర్టులో చిదంబరం బెయిల్ పిటీషన్‌పై విచారణ ప్రారంభమైనప్పుడు ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ బెయిల్ ఇవ్వరాదని కోర్టును కోరింది. సమాజంలో పలుకుబడి గల వ్యక్తి కాబట్టి సాక్షులను ప్రభావితం చేస్తారని, సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని తెలిపింది.