క్రైమ్/లీగల్

చెన్నమనేని పౌరసత్వంపై హైకోర్టులో పిటిషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 21: వేములవాడ శాసనసభ్యుడు చెన్నమనేని పౌరసత్వాన్ని కేంద్రహోం శాఖ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంపై ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చెన్నమనేని నకిలీ ధ్రువపత్రాలు సమఠ్పించారని పేర్కొంటూ చెన్నమనేని పిటిషన్‌పై ముందస్తు సమాచారం ఇవ్వాలని ఆది శ్రీనివాస్ హైకోర్టులో కేవియట్ దాఖలు చేశారు. రమేష్‌బాబు పౌరసత్వానికి దరఖాస్తు చేసిన సమయంలో భారతదేశంలో లేకపోయినా 12 నెలల పాటు ఇక్కడే ఉన్నట్టు తప్పుడు సమాచారం ఇచ్చారని, ఒక వేళ భారతదేశంలో లేరనే సమాచారాన్ని ఆనాడే ఇచ్చి ఉంటే ఆయనకు భారత్ పౌరసత్వం వచ్చేది కాదని పిటిషనర్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. పౌరసత్వం కోసం తప్పుడు సమాచారం ఇచ్చే వ్యక్తులు దేశానికి ఏం మంచి పనులు చేస్తారని ఆయన ప్రశ్నించారు. రమేష్‌బాబు తాను ఎటువంటి నేరపూరిత కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని అఫిడవిట్‌లో పేర్కొనడంపైనా ఆది శ్రీనివాస్ అభ్యంతరం వ్యక్తం చేశారు. రమేష్‌బాబు పౌరసత్వం చెల్లదంటూ 2009లో ఆయనపై పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో ఆది శ్రీనివాస్ హైకోర్టును ఆశ్రయించగా, కేంద్ర హోం శాఖ పరిధిలో ఈ విషయం ఉందని రమేష్‌బాబు పేర్కొన్నారు. విచారించిన కోర్టు కేంద్ర హోం శాఖ ఒక కమిటీని నియమించి విషయాన్ని తేల్చాలని పేర్కొంది. 2010లో ఎస్‌కే టాండన్ నేతృత్వంలోని హోం శాఖ త్రిసభ్య కమిటీని నియమించింది. తన తల్లిదండ్రులు స్వాతంత్య్ర సమరయోధులని తాను జర్మనీలో విద్యాభ్యాసం చేశానని, 1993లో జర్మనీ పౌరసత్వం పొందానని రమేష్ ఆ కమిటీ ముందు వాదనలు వినిపించారు. వాదనలు అన్నీ విన్న కమిటీ ఆయన పౌరసత్వం చెల్లదని తీర్పు చెప్పింది. 2017లో హోం శాఖ రమేష్ బాబు పౌరసత్వాన్ని రద్దు చేసింది. దానిని సవాలు చేస్తూ రమేష్‌బాబు మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాలతో 2019 అక్టోబర్ 31న ఇరుపక్షాలు తమ వాదనలను హోం శాఖ ముందు వినిపించాయి. వాదనలు పరిగణనలోకి తీసుకున్న హోం శాఖ రమేష్‌బాబు పౌరసత్వాన్ని రద్దు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాలపై మరోమారు రమేష్ బాబు హైకోర్టు తలుపులు తట్టారు. సెక్షన్ 10.3 ప్రకారం పౌరసత్వం చట్టంలోని నిబంధలను చూడాలని, కానీ సాంకేతికంగా విడదీసి విశే్లషించరాదని రమేష్‌బాబు వాదిస్తున్నారు.