తెలంగాణ

ఆర్టీసీ కండక్టర్ ఆత్మహత్యా యత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్, నవంబర్ 27: ఒక పక్క సమ్మె సమస్యకు కనుచూపు మేరలో కానరాని పరిష్కారం.. ఇంట్లో చూస్తే ఇల్లు గడవక కడుపుమాడుతున్న వైనం.. మరో పని చేద్దామన్నా చేయలేని దైన్యం.. ఈ పరిస్థితలో తీవ్ర ఆవేదనకు గురైన మెదక్‌కు డిపోకు చెందిన కండక్టర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె బుధవారం నాటికి 54 రోజులకు చేరుకున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం, విధుల్లో చేరతానన్నా నిరాకరిస్తుండటంతో మెదక్ డిపోకు చెందిన మైసన్న అనే కండక్టర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. ఈయనకు ఇల్లు లేదు, పొలం లేదు. ఇద్దరు సంతానం ఉన్నారు. కిరాయి ఇంటిలో ఉన్నామని, కొడుకు అజయ్‌కుమార్ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని కండక్టర్ ఆయన తెలిపారు. కామారెడ్డి జిల్లా జూకల్ మండలంలో నివసిస్తున్నామని, భార్య లక్ష్మీ, తాను ఉన్నట్టు తెలిపారు. బతుకుదెరువు మొత్తం ఉద్యోగం మీద ఆధారపడి జీవిస్తున్నట్టు తెలిపారు. కార్మికుల పట్ల హైకోర్టు సహకరించ లేదు, 54 రోజుల ఆర్టీసీ నిరవధిక సమ్మెలో పాల్గొన్నప్పటికీ ఆర్టీసీ జేఏసీ రాష్ట్ర నాయకుడు అశ్వత్థామరెడ్డితో అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కడుపుకు అన్నం లేదు, మూడు నెలలుగా ఇంటి కిరాయి చెల్లించ లేదని, వేరే మార్గం లేక పురుగు మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడినట్లు ఆయన తెలిపారు. మెదక్ ఏరియా ఆసుపత్రిలో ప్రథమ చికిత్స నిర్వహించి కండక్టర్ మైసన్నను గాంధీ ఆసుపత్రికి తరలించారు. కార్మికులు చాలా మంది ఆయనను పరామర్శించడానికి మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలివచ్చారు. సీఐ వెంకట్, హావేళి ఘణాపూర్ ఎస్సై శేఖర్‌రెడ్డి తదితర పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో ఏరియా ఆసుపత్రిలో భారీ బందోబస్తు నిర్వహించారు. మెదక్ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పీసీ.శేఖర్, ఆర్‌ఎంఓ చంద్రశేఖర్ చికిత్స నిర్వహించి కండక్టర్ మైసన్నను గాంధీ ఆసుపత్రికి తరలించారు.
*చిత్రం... ఆత్మహత్యా యత్నం చేసి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కండక్టర్ మైసన్న