క్రైమ్/లీగల్

గవర్నర్ పేరుపై రిజిస్ట్రీ అభ్యంతరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 19: పిటిషన్‌లో గవర్నర్ పేరును చేర్చాలా వద్దా అనే అంశంపై హైకోర్టు తీర్పును రిజర్వు చేస్తున్నట్లు ప్రకటించింది. రెం డు పిటిషన్లలో గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ పేరును ప్రతివాదిగా చేర్చడంపై హైకోర్టు రిజిస్ట్రీ అభ్యంతరం తెలిపింది. ఈ పిటిషన్లను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు విచారించారు. ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు వ్యాఖ్యానిస్తూ రాజ్యాంగంలోని 361 అధికరణ ప్రకారం, సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు పిటిషన్‌లో ప్రతివాదిగా గవర్నర్‌ను చేర్చరాదని పేర్కొన్నారు. ఈ పిటిషన్లలో గవర్నర్ పేరును ప్రస్తావించకపోయినా విచారిస్తామని హైకోర్టు పేర్కొంది. కాగా ఈ పిటిషన్లలో గవర్నర్ పేరును ప్రతివాదిగా చే ర్చాలని పిటిషనర్లు ఎందుకు డిమాండ్ చేస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది. గవర్నర్‌కు నోటీసు ఇచ్చే అధికారం హైకోర్టుకు లేదని అన్నారు. పిటిషనర్ల తరఫున వాదనలు వినిపిస్తున్న న్యాయవా ది మల్లికార్జునరావును హైకోర్టు కొన్ని వివరాలు అడిగింది. గవర్నర్ పేరును పిటిషన్ నుంచి తొలగిస్తారా లేదా అని హైకోర్టు ప్రశ్నించింది. గవర్నర్ పేరును తొలగించమని తగిన ఆదేశాలు ఇవ్వాలని న్యాయవాది కోర్టును అభ్యర్థించారు.
ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన భూమాన అఖిలప్రియ, తెలంగాణ లో మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తలసా ని శ్రీనివాస యాదవ్ ఇద్దరూ మంత్రి పదవుల్లో కొనసాగడానికి అనర్హులని పిటిషనర్ పేర్కొన్నా రు. ఆంధ్ర స్పీకర్‌గా కోడెల శివప్రసాదరావు, తెలంగాణ స్పీకర్‌గా మధుసూదనాచారి అనర్హులని పిటిషనర్ మరో పిటిషన్ దాఖలు చేశారు. వి పక్షాల నుంచి ఎన్నికై అధికార పార్టీలో మంత్రు లుగా చేరారని పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల స్పీకర్లు పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం కింద ఈ మంత్రులపై చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని పిటిషన్‌లో పేర్కొన్నారు. అనంతరం రిజిస్ట్రీ ప్రస్తావించిన అభ్యంతరాలపై తీర్పును రిజర్వు చేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది.
పునరావాస చర్యలపై నివేదిక ఇవ్వండి
ప్రాజెక్టుల నిర్మాణంతో నిర్వాసితులైన వారికి పునరావాసాన్ని కల్పించేందుకు తీసుకున్న చర్యలను వివరించాలని హైకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఆదేశాలను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ విజయలక్ష్మితో కూడిన ధర్మాసనం జారీ చే సింది. ఆంధ్ర వ్యవసాయ కార్మిక యూనియన్ కార్యదర్శి వెంకటేశ్వర్లు దాఖలు చేసిన పిల్ హై కోర్టు విచారించింది.
సర్వే ద్వారా బాధిత కుటుంబాల వివరాలను సేకరిస్తున్నామని ఏపీ అడ్వకేట్ జనరల్ శ్రీనివాస్ తెలిపారు. త్వరలోనే బాధితుల కు జిల్లా కలెక్టర్ అవార్డును ప్రకటిస్తారని ఆయన కోర్టుకు తెలిపారు. అనంతరం ఈ కేసు విచారణ ను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది.