క్రైమ్/లీగల్

ఏమిటీ? ఈ విధ్వంసకాండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 16: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాలు హింస, విధ్వంసకాండకు దారి తీయడం పట్ల సుప్రీం కోర్టు సోమవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హింసాకాండ తక్షణమే ఆగాలని ఆదేశించింది. ఇది శాంతి-భద్రతల సమస్య కాబట్టి ఇందులో తాము జోక్యం చేసుకోలేమని, పోలీసులే పరిస్థితిని అదుపు చేయాలని స్పష్టం చేసింది. అలీగఢ్ యూనివర్సిటీ, జామియా యూనివర్సిటీ విద్యార్థులపై పోలీసులు జరిపిన దాడులకు సంబంధించిన పిటిషన్లను మంగళవారం విచారించేందుకు అంగీకరించింది. అయితే ఇందుకు వీలుగా హింసాత్మక పరిస్థితులు తక్షణమే ఆగిపోవాలని ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బాబ్డె సారథ్యంలోని సుప్రీం బెంచ్ విజ్ఞప్తి చేసింది. అయితే ఈ పరిస్థితికి ఎవరినో నిందించడానికి తాము ఇక్కడ లేమని, హింసాకాండ వెంటనే ఆగాలని తెలిపింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే మాత్రం దీనిపై ఎలాంటి విచారణ జరపలేమని పేర్కొంది. విద్యార్థులపై జరిగిన దాడులకు సంబంధించిన కేసులు తనంతట తానుగానే కోర్టు విచారించాలని సీనియర్ న్యాయవాదులు ఇందిరా జైసింగ్, కొలిన్ గంజాల్వేస్ కోర్టును కోరారు.