క్రైమ్/లీగల్

బీజేపీ ఎమ్మెల్యేనే దోషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావో అత్యాచార కేసులో బీజేపీ నుంచి ఇదివరకే బహిష్కరణకు గురైన ఎమ్మెల్యే కుల్‌దీప్ సింగ్ సెంగార్ దోషి అని ఢిల్లీ కోర్టు తీర్పునిచ్చింది. శిక్షను బుధవారం ఖరారు చేయనున్నది. సెంగార్‌కు యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశం ఉందని అంటున్నారు. ఈ కేసులో మరో నిందితుడైన శశి సింగ్‌ను నిర్ధోషిగా తేల్చింది. బాధితురాలు గ్రామస్థురాలు కావడం, నిందితునికి పలుకుబడి ఉన్నందున పోలీసులు కేసు నమోదు చేయడంలో అలసత్వం ప్రదర్శించారని జిల్లా న్యాయమూర్తి ధర్మేశ్ శర్మ తెలిపారు. బాధితురాలిని, ఆమె కుటుంబ సభ్యులను నిందితునికి చెందిన వ్యక్తులు బెదిరిస్తుంటే పోలీసులు నిర్లక్ష్యం వహించారని ఆయన ఆగ్రహంగా అన్నారు. ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ఇంటి ముందు ఆత్మహత్య చేసుకుంటానని బాధితురాలు లేఖ రాసిన తర్వాతే పోలీసులు కేసు నమోదు చేశారని ఆయన తెలిపారు. కేసులో అడుగడుగునా నిర్లక్ష్యం, జాప్యం జరిగిందని అన్నారు. 2017 సంవత్సరంలో మైనర్ బాలికపై ఉన్నావో ప్రాంతంలో అపహరణ, అత్యాచారం జరిగింది. ఉత్తర్ ప్రదేశ్‌లోని బంగార్‌వౌ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే కుల్‌దీప్ సింగ్ సెంగార్ ఈ అత్యాచారానికి ఒడిగట్టినట్లు ఆరోపణలు రావడంతో బీజేపీ నాయకత్వం ఆయనను ఈ ఏడాది ఆగస్టులో పార్టీ నుంచి బహిష్కరించింది. సెంగార్‌పై అపహరణ, అత్యాచారం కేసులు నమోదయ్యాయి. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు లక్నో నుంచి ఢిల్లీ కోర్టుకు బదిలీ అయ్యింది. ఈ ఏడాది జూలై 28 బాధితురాలు తన ఇద్దరు బంధువులు, న్యాయవాదితో కలిసి కారులో ప్రయాణిస్తుండగా, నెంబర్ ప్లేట్ కనిపించకుండా ఉన్న ఓ ట్రక్కు కారును బలంగా ‘్ఢ’కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు బంధువులు మరణించగా, బాధితురాలు, న్యాయవాది తీవ్రంగా గాయపడ్డారు. బాధితురాలిని హత్య చేయడానికే ఈ కుట్ర జరిగిందన్న ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత ఆమెను లక్నోలోని ఆసుపత్రి నుంచి ఏయిమ్స్‌కు మార్చి చికిత్స జరిపించారు. ఈ ప్రమాద ఘటనపై సీబీఐ విచారణ చేపట్టింది. సీబీఐ విచారణలో, ఛార్జీషీట్ దాఖలు చేయడంలో జాప్యం జరిగిందని కోర్టు వ్యాఖ్యానించింది.
*చిత్రం...ఎమ్మెల్యే కుల్‌దీప్ సింగ్ సెంగార్