క్రైమ్/లీగల్

ఏసీబీ వలలో ముగ్గురు అధికారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు/, కొత్తవలస, డిసెంబర్ 16: రాష్ట్రంలో ముగ్గురు లంచగొండు అధికారులను ఏసీబీ వలపన్ని పట్టుకుంది. కర్మూలు జిల్లాలో సీఐ, విజయనగరం జిల్లాలో ఐసీడీఎస్ పీవో, సీనియర్ అసిస్టెంట్ అడ్డంగా దొరికిపోయారు. ఓ న్యాయ వాదిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వివరా లు ఇలా ఉన్నాయ.. కర్నూలు నగరంలోని సీసీఎస్ పోలీస్‌స్టేషన్‌లో సీఐగా పనిచేస్తున్న రామయ్యనాయుడు చిట్‌ఫండ్ నిర్వాహకుడి తరఫున న్యాయవాది చంద్రశేఖర్‌రెడ్డి నుంచి రూ. 40 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. సభ్యులను మోసగించిన అభియోగంపై రెండు నెలల క్రితం కర్నూలు సీసీఎస్ పోలీస్‌స్టేషన్‌లో నవకాంత్ చిట్‌ఫండ్ సంస్థపై ఛీటింగ్ కేసు నమోదైంది. కేసు దర్యాప్తు బాధ్యతలను అధికారులు సీసీఎస్ సీఐ రామయ్యనాయుడుకు అప్పగించారు. ఈ క్రమంలో సంస్థ నిర్వాహకుల్లో ఒకరైన ఆదినారాయణరెడ్డిని అరెస్టు చేయకుండా ఉండేందుకు సీఐ రూ. 40వేలు లంచం డిమాండ్ చేశారు. లంచం ఇచ్చేందుకు ఇష్టపడని ఆదినారాయణరెడ్డి బంధువు శివరామిరెడ్డి ఈనెల 13న అవినీతి నిరోధకశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారి సూచన మేరకు సీఐ రామయ్యనాయుడు ఇంటి సమీపంలోని హోటల్ ఆవరణలో ఉండగా న్యాయవాది చంద్రశేఖర్‌రెడ్డి
ద్వారా రూ. 40 వేలు లంచం అందించారు. అదే సమయంలో ఏసీబీ అధికారులు దాడి జరిపి సీఐని పట్టుకున్నారు. న్యాయవాదితో పాటు సీఐని అరెస్టు చేసినట్లు కర్నూలు ఏసీబీ డీఎస్పీ నాగభూషణం తెలిపారు. మరోవైపు సీఐ రామయ్యనాయుడు ఇంట్లోనూ అనిశా అధికారులు సోదాలు నిర్వహించారు. అక్రమ ఆస్తులు పట్టుబడితే మరో కేసు నమోదు చేసే అవకాశం ఉంది. అలాగే విజయనగరం జిల్లా కొత్తవలస మండలం వియ్యంపేట ఐసీడీఎస్ పీవో పి.మణమ్మ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ జీవీకే వేణుగోపాల్ సోమవారం అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు. వియ్యంపేట ఐసీడీఎస్ పరిధిలో 226 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయని, వాటికి సరకులు పంపిణీ చేస్తున్న వ్యక్తి నుండి లంచం అడిగి తీసుకున్నారన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులకు, బాలింతలకు రోజువారీ అందిస్తున్న కూరగాయలు, ఇతర తినుబండారాలు సరఫరా చేస్తున్న ఆడారి సురేష్‌కుమార్ అనే వ్యక్తి నుండి భారీ మొత్తంలో ఐసీడీఎస్ పీవో లంచం డిమాండ్ చేశారన్నారు. నవంబర్ నెలకు సంబంధించిన బిల్లులు సుమారు నాలుగు లక్షలకు పైగా చెల్లించమని పీవోని సురేష్‌కుమార్ కోరగా 85 వేల లంచం అడిగారని తెలిపారు. కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ జీవీకే వేణుగోపాల్‌కు 85 వేల రూపాయల లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వీరిని విచారిస్తున్నారు.
*చిత్రాలు.. సీఐ రామయ్యనాయుడు, లాయర్ చంద్రశేఖర్ రెడ్డిని అరెస్టు చేసిన ఏసీబీ డీఎస్పీ నాగభూషణం

*పట్టుబడిన ఐసీడీఎస్ పీవో మణమ్మ, సీనియర్ అసిస్టెంట్ వేణుగోపాల్