క్రైమ్/లీగల్

చెన్నమనేనికి మరింత ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: వేములవాడ శాసనసభ్యుడు చెన్నమనేని రమేష్ పౌరసత్వం రద్దు అంశంపై సోమవారం నాడు హైకోర్టులో విచారణ కొనసాగింది. చెన్నమనేని పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేయగా, వాటిపై చెన్నమనేని హైకోర్టును ఆశ్రయించారు. తొలుత యథాతథ స్థితిని విధించిన హైకోర్టు ఆ ఉత్తర్వులను మరో 8 వారాల పాటు పొడిగించింది. చెన్నమనేని ఈ సందర్భంగా అఫిడవిట్ దాఖలు చేస్తూ తాను జర్మనీ పౌరసత్వాన్ని వదులుకున్నానని పేర్కొనగా, ఈ అంశంపై వివరణ ఇవ్వాలని హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది. వాస్తవాలను దాచిపెట్టి మోసపూరిత విధానాల ద్వారా చెన్నమనేని భారత పౌరసత్వాన్ని పొందినట్టు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు రావడంతో దానిపై విచారణ జరిపించిన హోం శాఖ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. భారత పౌరసత్వ చట్టం-1955లోని సెక్షన్ 10 ప్రకారం ఆయన పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్టు పేర్కొంది. చెన్నమనేని పౌరసత్వం చెల్లదంటూ 2009లో ఆయనపై పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ ఈ ఫిర్యాదు చేశారు. అదే సమయంలో ఆది శ్రీనివాస్ హైకోర్టును కూడా ఆశ్రయించారు. కేంద్ర హోం శాఖ పరిధిలో ఈ విషయం ఉందని రమేష్‌బాబు కోర్టుకు విన్నవించారు. ఈ వ్యవహారంపై ఒక కమిటీని నియమించి తేల్చాలని హైకోర్టు ఆదేశించింది. 2010లో టాండన్ కమిటీని కేంద్ర హోం శాఖ నియమించింది. తన తల్లిదండ్రులు స్వాతంత్య్ర సమరయోధులని, తాను జర్మనీలో విద్యాభ్యాసం చేశానని, 1993లో జర్మనీ పౌరసత్వాన్ని పొందానని రమేష్ పేర్కొన్నారు. వాదనలు విన్న టాండన్ కమిటీ
రమేష్ పౌరసత్వం చెల్లదని నివేదించింది. దీంతో 2017లో కేంద్ర హోం శాఖ చెన్నమనేని పౌరసత్వాన్ని రద్దు చేసింది. దానిని సవాలు చేస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. విషయాన్ని తేల్చాల్సింది కేంద్ర హోం శాఖ మాత్రమేనని పేర్కొంటూ హైకోర్టు జూలై నెలలో ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలతో 2019 అక్టోబర్ 31న ఇరుపక్షాల వాదనలను హోం శాఖ రికార్డు చేసింది. అనంతరం చెన్నమనేని పౌరసత్వం చెల్లదంటూ ఉత్తర్వులను జారీ చేసింది. కేంద్ర హోం శాఖ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ చెన్నమనేని హైకోర్టును మరోమారు ఆశ్రయించారు. జర్మనీ పౌరసత్వం వదులుకున్నట్టు కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.
మున్సిపల్ ఎన్నికలపై రిట్
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ప్రస్తుతం అమలులో ఉన్న జీవోను గతంలో హైకోర్టు కొట్టివేసినందున, ఆ జీవో ప్రాతిపదికపై ఎన్నికలు నిర్వహించేందుకు వీలు లేదని, ఈ అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో రిట్ దాఖలైంది. గతంలో మున్సిపల్ ఎన్నికల పిటిషన్ల విచారణ సందర్భంగా ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు కొట్టి వేసిందని ఈ సందర్భంగా పిటిషనర్ న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు.

*చిత్రం...వేములవాడ శాసనసభ్యుడు చెన్నమనేని రమేష్