క్రైమ్/లీగల్

జెలిటెన్ స్టిక్స్, డిటోనేటర్ల వ్యాపారుల అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, డిసెంబర్ 16: అక్రమంగా జెలిటెన్ స్టిక్స్, డిటోనేటర్ల వ్యాపారాన్ని నిర్వహిస్తున్న ముగ్గురు నిందితులను దుందిగల్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. దుందిగల్ పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలను బాలానగర్ జోన్ డీసీపీ పద్మజా, దుందిగల్ సీఐ వెంకటేశ్వర్లు వెల్లడించారు. యాదాద్రి జిల్లా యాట సతీశ్(33) డ్రైవర్‌గా పనిచేస్తాడు. దుందిగల్ గండిమైసమ్మకు చెందిన అలకుంట స్వామీస్(36) డ్రైవర్‌గా పనిచేస్తాడు. యాదాద్రి జిల్లా ఆలేరు కందిగడ్డ తండాకు చెందిన కేతావత్ వెంకటేశ్ డ్రైవర్‌గా పనిచేస్తాడు. మరో నిందితుడైన శివర్త్వి రఘుపతి పరారీలో ఉన్నాడు. సతీశ్, రఘుపతి జెలిటెన్ స్టిక్స్, డిటోనేటర్లను అక్రమ మార్గంలో సేకరించి ఎలాంటి అనుమతులు, లైసెన్స్‌లు లేకుండా అక్రమంగా నిల్వ చేయడంతో పాటు పేలుడు పదార్థాల వాడకం, రవాణా కార్యకలాపాలు చేస్తుంటారు. అలకుంట స్వామీస్ పలు పనులలో కంప్రేషర్ ట్రాక్టర్ సహాయంతో పేలుడు నిర్వహించడం, కేతావత్ వెంకటేశ్ పేలుడు పదార్థాలను సిఫ్ట్ కారులో తరలించేవాడు. అక్రమ రాక్ పేలుడు పదార్థాల కార్యకలాపాలతో సతీశ్, స్వామీస్ మధ్య పరిచయం పేరిగింది. అక్రమంగా కారులో పేలుడు పదార్థాలను తరలిస్తుండగా బాలానగర్ ఎస్‌ఓటీ, దుందిగల్ పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. ముగ్గురు నిందితులైనై సతీశ్, స్వామీస్, వెంకటేశ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కారు, జెలిటెన్ స్టిక్స్ 1350, డిటోనేటర్లు 12000, మూడు సెల్‌ఫోన్‌లను స్వాధీన పరుచుకున్నారు.