క్రైమ్/లీగల్

ఏడుగురిని ఢీకొన్న ట్రాలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, డిసెంబర్ 16: నిలబడి ఉన్న ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురితో పాటు మరో వ్యక్తిని ఓ ట్రాలీ వాహనం ఢీకొంది. ఆరుగురికి గాయాలైన సంఘటన బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం పాతబస్తీకి చెందిన రవీందర్ బాచుపల్లిలోని మమతా ఆసుపత్రిలో వార్డ్‌బాయ్‌గా పనిచేస్తాడు. రవీందర్ చెల్లి లక్ష్మీ ఆమె కూతురు మానస, ఆమె కూతురు అనన్య ఆరోగ్యం బాగులేదని బాచుపల్లిలోని మమతా ఆసుపత్రికి వచ్చారు. ఆసుపత్రి బయటకు వచ్చిన మానస పెద్ద కూతురు సమీరా, మానస అత్త రమ, మామ స్వామి, రవీందర్ చెల్లి లక్ష్మీ ఆటో కోసం ఎదురు చూస్తున్నారు. మియాపూర్ నుంచి బాచుపల్లి గ్రామం వైపు అతివేగంగా దూసుకువస్తున్న మహీంద్రా ట్రాలీ వాహనం ఆటో కోసం ఎదురుచూస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని ఢీకొట్టడంతో పాటు టీ తాగుతున్న మరో వ్యక్తిని ఢీకొంది.
గాయాలకు గురైన వారిని చికిత్స నిమిత్తం మమతా ఆసుపత్రిలో చేర్పించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.