క్రైమ్/లీగల్

ఆర్టీసీ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, డిసెంబర్ 16: తమను విధుల్లో నుంచి తొలగించి, నిరుద్యోగంలోకి నెట్టవద్దని రవాణ శాఖ, జలసౌధ కార్యాలయాల వద్ద గూమిగూడిన ఆర్టీసీ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. ఆర్టీసీ సమ్మె ముగిసిన అనంతరం అధికంగా ఉన్న కండక్టర్లు, డ్రైవర్లను ప్రస్తుతం తాము చేస్తున్న టైపిస్టులుగా చేర్చే అవకాశం ఉందనే విషయాన్ని తెలుసుకున్న వారు తమ గోడును విన్నవించుకునేందుకు రాగా అనుమతి లేదని పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. పదేళ్లుగా సంస్థను నమ్ముకొని తక్కువ వేతనానికి పనిచేస్తున్న తమ జీవితం అగమ్యగోచారంలోకి నెట్టవద్దని ప్రభుత్వానికి విన్నవించారు.