క్రైమ్/లీగల్

ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు ‘సమత’ నిందితులు హాజరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్: సంచలనం రేపిన సమత హత్యాచార ఘటనలో సత్వర న్యాయం అందించే ‘దిశ’గా అడుగులు పడుతున్నాయి. లింగాపూర్ మండలం ఎల్లాపటార్ అటవీ ప్రాంతంలో చిరువ్యాపారం సాగించే సమతపై ముగ్గురు నిందితులు గత నెల 24న సామూహికంగా అత్యాచారం చేసి కిరాతకంగా హతమార్చిన ఘటన నేపథ్యంలో పోలీసులు నిందితులైన షేక్‌బాబా, షేక్ షాబొద్దీన్, షేక్ ముగ్దుమ్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన విషయం విదితమే. రిమాండ్ గడువు ముగియడంతో జిల్లా కోర్టు ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫాస్ట్‌ట్రాక్ న్యాయస్థానానికి ముగ్గురు నిందితులను పోలీసులు భారీ బందోబస్తు మధ్య హాజరుపర్చారు. ఇదివరకే పోలీసులు శీఘ్రగతిన కేసు దర్యాప్తు సాగించి ఫోరెన్సిక్ రిపోర్టు, డిఎన్‌ఏ నివేదికను, నిందితులు వినియోగించిన కత్తి, సెల్‌ఫోన్‌ను జడ్జీ ఎదుట పోలీసులు నివేదించారు. అయితే సోమవారం తొలి విచారణకు హాజరైన నిందితులను జడ్జి వాదనలు వినిపించేందుకు న్యాయవాదిని ఏర్పాటు చేసుకున్నారా అని ప్రశ్నించగా లేదని సమాధానం ఇచ్చారు. రెండు రోజులు గడువు ఇవ్వాలని నిందితులు కోరగా న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేస్తూ మంగళవారం లోగా న్యాయవాదిని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అయితే ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ న్యాయవాదులు మాత్రం నిందితుల తరపున వాదించేందుకు నిరాకరించడంతో న్యాయసేవ అధికార సంస్థ తరపున ప్రభుత్వమే న్యాయవాదిని నియమించే ఆస్కారం ఏర్పడింది. ఇదిలా ఉంటే సమత హత్యాచార ఘటనలో 44 మంది సాక్షులను న్యాయస్థానం విచారించనుంది. రోజుకు ఐదుగురి చొప్పున సాక్షులను కోర్టుకు పిలిపించే అవకాశం ఉంది. సత్వర న్యాయ విచారణలో భాగంగా తొలి రోజు నిందితులను పోలీసులు హాజరుపర్చిన అనంతరం న్యాయస్థానం ఈ కేసును మంగళవారానికి వాయిదా వేసింది.
*చిత్రం... నిందితులను కోర్టులో హాజరుపర్చేందుకు తీసుకువస్తున్న పోలీసులు