క్రైమ్/లీగల్

పారిశ్రామికవేత్త మిత్తల్ నివాసంలో ఐటీ దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, డిసెంబర్ 17: ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త రఘునాథ్ మిత్తల్ నివాసం, జిన్నింగ్‌మిల్లులో మంగళవారం ఆదాయపన్ను శాఖ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఐటీ అధికారుల బృందం హైదరాబాద్, కరీంనగర్ నుండి రెండు అధికారుల బృందాలు ఉదయం ఆదిలాబాద్ చేరుకొని ఏకకాలంలో మిత్తల్‌కు చెందిన సాయిబాబా జిన్నింగ్, ప్రెస్సింగ్ ఫ్యాక్టరీ, తన నివాసంలో ఏకకాలంలో సోదాలు నిర్వహించి పలు కీలకమైన డాక్యుమెంట్లను స్వాధీనపర్చుకున్నారు. ఆదిలాబాద్‌లో పేరుపొందిన వ్యాపారవేత్తగా గుర్తింపు పొందిన రఘునాథ్ మిత్తల్‌కు సంబంధించి ఆదిలాబాద్‌లో నాలుగు పత్తి ఆధారిత పరిశ్రమలు, రియల్ ఎస్ట్టేట్ వ్యాపారం, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో భారీ ఎత్తున వ్యాపారాలు సాగిస్తున్నట్టు ఐటి అధికారులకు సమాచారం అందినట్లు తెలిసింది. ఉదయం నుండి రాత్రి వరకు ఏకధాటిగా పలు రికార్డులను, ఆదాయ పన్ను వివరాలను క్షుణ్ణంగా పరిశీలించడం గమనార్హం. అయితే ఐటీ సోదాలకు సంబంధించి అధికారులు మీడియాకు అనుమతి ఇవ్వకుండా, ఎలాంటి సమాధానం చెప్పకుండా సోదాల్లోనే నిమగ్నం కావడం గమనార్హం. రఘునాథ్ మిత్తల్ పేరిట కొనే్నళ్ళుగా సాగుతున్న వ్యాపార సంస్థల ఆదాయ వివరాలపై ఆరా తీయడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. జిల్లాలో సుమారు రూ.200 కోట్లకు పైగా ఆస్తులు కలిగి ఉన్న రఘునాథ్ మిత్తల్ కొన్ని వ్యవహారాల్లో ఆదాయపన్ను చెల్లించడం లేదని ఫిర్యాదులు రావడంతోనే పక్కా సమాచారం మేరకు అధికారులు దాడులు నిర్వహించినట్టు తెలిసింది. రాత్రి వరకు మీడియాకు ఎలాంటి వివరాలు ఇవ్వకపోవడం గమనార్హం.