క్రైమ్/లీగల్

ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు సమత నిందితులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, డిసెంబర్ 17: సంచలనం సృష్టించిన సమత అత్యాచారం, హత్య ఘటనలో మంగళవారం ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు రెండో రోజు నిందితులు హాజరయ్యారు. ఆదిలాబాద్ కోర్టు ప్రాంగణంలో సమత కేసులో సత్వర విచారణ సాగించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసిన విషయం విదితమే. అయితే ఈ కేసులో తొలిరోజు న్యాయవాదిని నియమించుకోవాలని జిల్లా జడ్జి నిందితులకు సూచించి ఒక రోజు గడవు ఇవ్వగా మంగళవారం కోర్టుకు హాజరైన నిందితులు న్యాయవాది రహీం పేరును సూచించారు. అయితే బార్ అసోసియేషన్ ఇదివరకే నిందితుల తరపున ఎవరూ వాదించవద్దని తీర్మానం చేసినందున తాను వాదించబోనని స్పష్టం చేశారు. తనను సంప్రదించకుండానే నిందితులు తన పేరు ఎలా చెప్పారో అర్థం కావడం లేదని న్యాయవాది పేర్కొన్నారు. ఆ తర్వాత కోర్టు విచారణ సత్వరంగా సాగాలంటే న్యాయవాది ఉండాల్సిందేనని, న్యాయసేవా సాధికారిత సంస్థ ద్వారా ఒక న్యాయవాదిని నియమించాలని జడ్జి ఆదేశించారు. దీంతో కోర్టులోని ప్యానెల్‌బోర్డులో సీనియర్ అడ్వకేట్‌గా గుర్తింపు పొందిన ఏఏ రహీం పేరును బోర్డు ప్రతిపాదించడంతో ఆయన ఇందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఈ కేసులో ఫోరెన్సిక్ ల్యాబ్, డీఎన్‌ఏ రిపోర్టును పోలీసులు ఇదివరకే సమర్పించగా 44 మంది సాక్షులను న్యాయస్థానంలో విచారించాల్సి ఉంది. రోజువారీగా నలుగురైదుగురు చొప్పున సాక్షులను పిలిపించి విచారణ జరిపిస్తామని న్యాయవాది రహీం తెలిపారు.