క్రైమ్/లీగల్

మనీ లాండరింగ్ కేసులో సింఘాల్‌పై బలవంతపు చర్యలు వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 18: మనీ లాండరింగ్ కేసులో భూషణ్ స్టీల్ మాజీ ప్రమోటర్ నీరజ్ సింఘాల్‌పై బలవంతపు చర్యలేవీ చేపట్టరాదని ఢిల్లీ హైకోర్టు బుధవారం ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ను ఆదేశించింది. రెండు వేల కోట్ల రూపాయల మనీ లాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో నీరజ్ సింఘాల్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. ఇలాఉండగా బుధవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీఎన్ మూర్తి, న్యాయమూర్తి జస్టిస్ రేఖ పల్లితో కూడిన ధర్మాసనం కేంద్రానికి, ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్‌కు నోటీసులు జారీ చేసింది. నీరజ్ సింఘాల్‌పై ఏ విధమైన వైఖరిని అవలంభిస్తున్నారో తెలియజేయాలని కోర్టు ఆదేశించింది. పునరాలోచనగా వర్తించదని తెలిపింది. ఈ కేసు విచారణకు పూర్తిగా సహకరించాలని నీరజ్‌ను ఆదేశించింది. ఈడీ తరఫున కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ న్యాయవాది ఆమిత్ మహజన్ తన వాదన వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు బెంచ్ పిటీషనర్ నీరజ్ సింఘాల్‌పై బలవంతపు చర్యలు తీసుకోరాదని తెలిపింది.