క్రైమ్/లీగల్

రాజాసింగ్‌పై రౌడీషీట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 18: హైదరాబాద్‌లోని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పోలీసులు రౌడీషీట్ నమోదు చేశారు. మంగళ్‌హాట్ పోలీసులు రౌడీషీటర్ల జాబితాలో రాజాసింగ్ పేరును చేర్చా రు. ఒక పనిపై మంగళ్‌హాట్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన కొందరు బీజేపీ కార్యకర్తలు దీనిని గమనించి రాజాసింగ్‌కు సమాచారం అందించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇదిలావుండగా, ఇంకా తన పేరు రౌడీషీటర్
జాబితాలో ఉండడంపై ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. తాను అన్నీ వదిలేసి, ప్రజాసేవలోకి వచ్చానని తెలిపారు. తనపై రౌడీషీట్ పెట్టినందుకు బాధ లేదని, తాను ఇపుడు ఎమ్మెల్యేనా, రౌడీషీటర్‌నా అనే దానికి సీఎం, హోం శాఖ మంత్రి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
*చిత్రం... గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌