క్రైమ్/లీగల్

ఏసీబీ వలలో శ్రీసిటీ ఎస్‌ఐ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరదయ్యపాలెం/తడ, డిసెంబర్ 18: ఏసీబీ వలలో శ్రీసిటీ పారిశ్రామిక వాడలో ఉన్న హైటెక్ పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ సుబ్బారెడ్డి బుధవారం సాయంత్రం ఏసీబీ వలలో చిక్కుకున్నారు. అవినీతిని నిరోధక శాఖ విజయశేఖర్ ఆధ్వర్యంలోని ఏసీబీ బృందం వల పన్ని ఎస్‌ఐ సుబ్బారెడ్డిని పట్టుకున్నారు. ఇసుక మాఫియా, పలు కేసులలోని పేర్లను తారుమారు చేసేందుకు ఎస్‌ఐ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ముఖ్యంగా ఇసుకమాఫియాతో తెరచాటును వ్యవహారాలు జరుపుకుంటూ అధికమొత్తంలో లంచాలు తీసుకుంటున్నారని ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు నిఘా ఉంచి చాకచక్యంగా దాడులు చేసి రూ.1లక్ష లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎస్‌ఐను స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చి ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు.