క్రైమ్/లీగల్

భారీగా గంజాయి స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాచిపెంట, డిసెంబర్ 18: విజయనగరం జిల్లా పాచిపెంట మండలం పి. కోనవలస చెక్‌పోస్టు వద్ద బుధవారం పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో ఒక కంటైనర్‌లో భారీ ఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాలోని కొరాపుట్ జిల్లా పొట్టంగి నుంచి ఢిల్లీకి కంటైనర్‌లో అక్రమంగా తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి సుమారు 1500 కేజీలు ఉంటుందని, విలువ కోటి రూపాయల వరకు ఉండవచ్చని సాలూరు సీఐ సింహాద్రినాయుడు తెలిపారు. కంటైనర్‌ను తరలిస్తున్న డ్రైవర్ మహ్మద్ నరుూం, జాన్ అలాంలను అదుపులోకి తీసుకున్నామని, కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. భారీ మొత్తంలో గంజాయి సరఫరా కావడంతో చెక్‌పోస్టుల వద్ద నిఘా మరింత గట్టిగా ఏర్పాటు చేస్తామన్నారు. గతంలో కూడా 50 లక్షల రూపాయల విలువ చేసే 950 కేజీల గంజాయి పట్టుబడిందన్నారు. సీఐతోపాటు ఎస్‌ఐ గంగరాజు ఉన్నారు.